Janasena Party : పొత్తులతో జనసేన పార్టీ చిత్తు అవుతుందా.. ఆ పార్టీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటో..?
ప్రధానాంశాలు:
Janasena Party : పొత్తులతో జనసేన పార్టీ చిత్తు అవుతుందా.. ఆ పార్టీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటో..?
Janasena Party : సినిమాలలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయాలని భావించి జనసేన పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా కూడా ఏమంత పాజిటివిటీ కనిపించడం లేదు. తెలంగాణలో జనసేన దారుణ ఓటమి చవిచూడగా, ఏపీలో ప్రభావం చూపుతుందా? కచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే కొంత ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు రాజకీయంలో చాలా మార్పులు ఉండేవి. అప్పట్లో మంత్రి అంటే అల్లాటప్పాగా అయ్యేవారు కాదు. సహాయ మంత్రి ఇచ్చి చిన్న శాఖలను కలిపి ఆ తర్వాత మంత్రిని చేసేవారు. అప్పట్లో ముఖ్యమంత్రి కావడం కూడా కొందరికి మాత్రమే సాధ్యమయ్యేది. తెలుగుదేశం పార్టీ వచ్చాక పాతికేళ్ళు పట్టుమని ఉన్న వారు అంతా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మంత్రులు అవుతున్నారు. షార్ట్ కట్‌లో ఆలోచిస్తున్నారు.
Janasena Party : జనసేనాని నిర్ణయాలతో షాక్..
అయితే జనసేన అధినేత ఆలోచనలు పాత కాలం నాటివిగా ఉన్నాయి. రాష్ట్రం కోసం పని చేయాలని, అధికారం రాకపోయిన టీడీపీని గెలిపించాలని అంటున్నారు. అయితే జనసేనలో ఉండేవారికి రాజకీయం ఏంటో అర్ధం కావడం లేదు. ఆ పార్టీలో ఉన్న వారికి ఏం ఒరుగుతుందో అర్ధం కావడం లేదు. నలభై సీట్లు అయినా జనసేనకు దక్కుతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. అందులో సగం మాత్రమే పొత్తులో భాగంగా దక్కగా, అందులో టీడీపీ నుంచి వచ్చిన వారికి వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇదేంటంటే వ్యూహం అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారు అంతా అసహానానికి గురవుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలో కనీసంగా పదిహేను సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని అందులో చాలా సీట్లలో బలమున్న నేతలకు దక్కుతాయనుకుంటే అసలు వీలు పడలేదు. అందుకే చాలా మంది పార్టీని వీడిపోతున్నారు. విజయవాడ పశ్చిమ ఇంచార్జి పోతిన మహేష్ పార్టీకి దండం పెట్టారు. వీరి తరువాత వరసలో మరింతమంది నేతలు ఉన్నారు అని అంటున్నారు. దానికి కారణం అధినాయకత్వం స్వీయ తప్పిదాలే అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన అవసరం టీడీపీకే ఉంది. పట్టుబట్టి కనీసం నలభై సీట్లు సాధించి అందులో పార్టీ కోసం కష్టపడిన వారిని దించితే ఆ పరిస్థితి వేరేలా ఉండేది. రేపటి రోజున కూటమి అధికారంలోకి రాకపోతే జనసేనలో ఉన్నవారి పరిస్థితి ఏంటనేది ఎవరికి అర్ధం కావడం లేదు. టీడీపీ కూటమి వచ్చిన జనసేన 21 సీట్లు గెలిచిన కూడా రానున్న రోజులలో రాజకీయాన్ని తట్టుకోవడం కష్టమే. త్యాగాలు రాజకీయాలలో పని చేయవు అనే దానికి జనసేన ఉదాహరణ అని కొందరు చెబుతున్నమాట