KTR – Revanth Reddy : కాంగ్రెస్ పుంజుకుంది.. ఒప్పుకున్న కేటీఆర్.. షాక్‌లో బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నేతల సంబరాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KTR – Revanth Reddy : కాంగ్రెస్ పుంజుకుంది.. ఒప్పుకున్న కేటీఆర్.. షాక్‌లో బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నేతల సంబరాలు

KTR – Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం దూసుకుపోతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. అధికార బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతోంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా ప్రస్తుతం ప్రజల నాడి తెలుసుకున్నా.. ఎక్కడ చూసినా జనాలు కాంగ్రెస్ కే ఓటేస్తాం అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  రాష్ట్రంలో నిజంగానే కాంగ్రెస్ కు బలం పెరిగిందా?

  •  కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారా?

  •  6 గ్యారెంటీ హామీలను ప్రజలు నమ్ముతున్నారా?

KTR – Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం దూసుకుపోతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. అధికార బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతోంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా ప్రస్తుతం ప్రజల నాడి తెలుసుకున్నా.. ఎక్కడ చూసినా జనాలు కాంగ్రెస్ కే ఓటేస్తాం అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజలు కూడా రెండు సార్లు అధికారం ఇచ్చాం కదా అన్న ధోరణిలోనే ఉన్నారు. అందుకే మరో పార్టీకి ఈసారి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అది కాంగ్రెస్ ఎందుకు కాకూడదు అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రచార దూకుడును పెంచింది.

బీఆర్ఎస్, బీజేపీ నుంచి వలసలు కూడా పెరిగాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వస్తోంది. అలాగే.. 6 గ్యారెంటీ హామీలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశా పయనించేలా దోహదపడుతున్నాయి. తెలంగాణ ప్రజలు కూడా ఆరు గ్యారెంటీ హామీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ లాంటి పథకాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాలు, దళితులను బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇది కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ కాబోతోంది. దీన్ని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఎదురుదాడి చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా పెరుగుతోందని పార్టీపై, పార్టీ నేతలపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.

KTR – Revanth Reddy : ముఖ్యమంత్రి కుర్చీ కోసం తన్నుకునే నాయకులు వీళ్లు

కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి కుర్చీ కోసం నాయకులంతా తన్నుకుంటారు. తెలంగాణలో సుస్థిరత కరువు అవుతుంది. కర్ణాటక రైతుల పేరుతో డ్రామాలు నడుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఓట్ల చీలిక ఉండదు. ఇది బీఆర్ఎస్ కు ఒకరకంగా ఇబ్బంది పెట్టే అంశమే. అందుకే కాంగ్రెస్ బలాన్ని గుర్తించిన కేటీఆర్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది