Roja : రేయ్ నీ అమ్మని, నీ భార్యని అలాంటి బూతులు తిడితే ఇలాగే సపోర్ట్ చేస్తావా రా పప్పు లోకేష్ | The Telugu News

Roja : రేయ్ నీ అమ్మని, నీ భార్యని అలాంటి బూతులు తిడితే ఇలాగే సపోర్ట్ చేస్తావా రా పప్పు లోకేష్

Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు సంబురాలు చేసుకోవడం, ఆయనకు తగిన శాస్తి జరిగిందని మీడియా ముందు మాట్లాడటంపై టీడీపీ నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయనకు తగిన శాస్తి జరిగిందని మళ్లీ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల్లో మంత్రి రోజా అయితే చంద్రబాబును అనరాని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 October 2023,3:00 pm

Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు సంబురాలు చేసుకోవడం, ఆయనకు తగిన శాస్తి జరిగిందని మీడియా ముందు మాట్లాడటంపై టీడీపీ నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయనకు తగిన శాస్తి జరిగిందని మళ్లీ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల్లో మంత్రి రోజా అయితే చంద్రబాబును అనరాని మాటలు అన్నారు. చివరకు నారా లోకేష్ పై, భువనేశ్వరి, బ్రాహ్మణిపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ రోజాపై విరుచుకుపడ్డారు. అసలు నువ్వేంటో.. నీ బతుకేంటో నాకు తెలుసు. మొత్తం చెప్పమంటావా? నీ చిట్టా విప్పమంటావా? అని తీవ్రస్థాయిలో రోజాపై విరుచుకుపడ్డాడు బండారు. ఆయన వ్యాఖ్యలతో మరోసారి ఏపీలో రాజకీయ అలజడి చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా భగ్గుమన్నారు. తాజాగా బండారు వ్యాఖ్యలపై రోజా కూడా స్పందించారు.

నేను అడుగుతున్నా. మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు. మీ భార్యలు ఉన్నారు. మీ కూతుళ్లు ఉన్నారు. మీ కోడళ్లు ఉన్నారు. వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీరు సపోర్ట్ చేస్తారా? అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్లు, సినిమా వాళ్లు అంటారు. మీ పార్టీ పెట్టింది ఎవరు.. మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్లను చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు.. నేను అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట మీరు ఏవిధంగా హరాస్ చేశారు. నా క్యారెక్టర్ ను ఏవిధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు అందరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఓపికగా ఉంటుంటే రోజూ శృతి మించిపోతున్నారు. ఏం మీ ఇంట్లో ఆడాళ్లు మాత్రమే ఆడోళ్లా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడాళ్లు.. ఆడోళ్లు కాదా? మాకు మనసు లేదు. మాకు ఫ్యామిలీ లేదా? మాకు పిల్లలు లేరా? మీరు ఏం మాట్లాడినా.. అందరూ అడ్జస్ట్ అయి ముందుకు వెళ్లిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు. ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్ గా. ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడు అని తెలిసిందో.. చెప్పు తీసుకొని నువ్వు కొట్టి ఉంటే.. మళ్లీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడడు.. అంటూ రోజా సీరియస్ అయ్యారు.

minister roja counter to nara lokesh his support to bandaru

#image_title

Roja : బండారు కూతురు, కోడలు ఎందుకు లాగి పెట్టి కొట్టలేదు?

బండారుకు కూతురు ఉంది.. కోడలు ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు మమ్మల్ని కూడా ఎవరైనా అంటారని.. లాగి పెట్టి చెంప మీద కొట్టి ఉంటే ఆయన అలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తోంది. ఒకసారి మీరే వినండి.. అంటూ బండారు మాట్లాడిన వీడియోను మీడియాకు చూపించింది రోజా. ఇదేనా మహిళల కోసం టీడీపీ పాటుపడే పార్టీనా. సిగ్గు లేకుండా లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. ఏం తప్పు చేశాడు బండారు అంటూ ట్వీట్ చేస్తున్నాడు లోకేష్. ఆ రోజు మీ పార్టీలో పని చేసినప్పుడు నేను మంచిదాన్ని. ఇప్పుడు మీ పార్టీలో నుంచి బయటికి వచ్చాక నేను చెడ్డదాన్నా? అంటూ రోజా.. లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...