Roja VS Bandaru : ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు.. ఆడదాన్ని బతకనివ్వరా.. లైవ్‌లో వెక్కివెక్కి ఏడుస్తూ మంత్రి రోజా ఆవేదన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja VS Bandaru : ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు.. ఆడదాన్ని బతకనివ్వరా.. లైవ్‌లో వెక్కివెక్కి ఏడుస్తూ మంత్రి రోజా ఆవేదన

 Authored By kranthi | The Telugu News | Updated on :4 October 2023,6:00 pm

Roja VS Bandaru : ఏపీలో రాజకీయాలు కాస్త రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతున్నాయి. దానికి కారణం.. ఒకటి చంద్రబాబు అరెస్ట్ కాగా.. మరోటి మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచింది. ఏంటి రోజా నీ బతుకు ఎవరికి తెలియదు. నువ్వేంటో.. నీ బతుకేంటో నాకు తెలుసు. నువ్వు ఆ సినిమాల్లో యాక్ట్ చేసింది మాకు తెలియదనుకుంటున్నావా? నీ జాతకం మొత్తం బయటపెడతా. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మిర్యాలగూడ వచ్చినప్పుడు ఏం చేశావో అందరికీ తెలుసు.. అంటూ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బండారు వ్యాఖ్యలపై వైసీపీ నేతలే కాదు.. ఏపీ మహిళలు కూడా భగ్గుమంటున్నారు. ఒక మహిళను పట్టుకొని అంత దారుణంగా మాట్లాడుతారా? అసలు బండారు మనిషేనా.. ఆయన ఇంట్లో మహిళలు లేరా? వాళ్లను ఎవరైనా ఏదైనా అంటే అలాగే ఊరుకుంటారా? అని మండిపడుతున్నారు. మరోవైపు తనపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు రోజా.. బండారుపై కేసు ఫైల్ చేశారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

తాజాగా బండారు వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడిన రోజా.. రోజురోజుకూ వీళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయన్నారు. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు మాత్రమే ఆడవాళ్లా అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. వైసీపీలో ఉన్న ఆడవాళ్లు ఆడవాళ్లు కాదా అంటూ మండిపడ్డారు. నాకు మనసు లేదా? మాకు ఫ్యామిలీ లేదా మాకు పిల్లలు లేరా? మీరు ఏం మాట్లాడినా సర్దుకుపోవాలా? ఏం మాట్లాడుతున్నావు. ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్ గా. ఎప్పుడైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో.. చెప్పు తీసుకొని నువ్వు కొట్టి ఉంటే.. మరొకసారి నీ మొగుడు ఇలా మాట్లాడడు. ఆయనకు కూతురు ఉంది.. కోడలు ఉంది. వాళ్లిద్దరూ కనుక ఇలా ఒక ఆడదానిపై మాట్లాడితే రేపు మమ్మల్ని ఎవరైనా ఇలా అంటే ఏం చేసేది అని లాగి పెట్టి ఆయన్ను కొట్టి ఉంటే మళ్లీ ఇలాంటి ఆలోచన ఆయనకు రాదు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది.. అంటూ ఆ వీడియోను మంత్రి రోజా ప్లే చేసి చూపించారు.

minister roja fires on bandaru satyanarayana comments

#image_title

Roja VS Bandaru : ఇలా మాట్లాడితే ఏ మహిళ అయినా రాజకీయాల్లో ముందుకు వెళ్తుందా?

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇలా మాట్లాడితే ఏ మహిళ అయినా రాజకీయాల్లో ముందుకు వెళ్తుంది.. అంటూ రోజా మండిపడ్డారు. ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేయాలి చెప్పండి. ఏం తప్పు మాట్లాడాడు బండారు అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు. మీ పార్టీ కోసం పని చేయడం తప్పా? మీ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నా క్యారెక్టర్ బాగోలేనప్పుడు అప్పుడు నాతో ఎందుకు ప్రచారం చేయించారు. ఆ రోజు మీ పార్టీలో పని చేసినప్పుడు మంచిదాన్ని. 1999 ఎన్నికల్లో కష్టపడి ప్రచారం చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను మంచిదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నచ్చక బయటికి వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. నేను మంచిదాన్ని కాదు అంటూ నన్ను బ్యాడ్ చేయాలని చూశారు. జగనన్న, విజయమ్మ నన్ను అక్కున చేర్చుకున్నారు.. అంటూ రోజా మండిపడ్డారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది