Nallari kiran kumar reddy : వైఎస్‌కి లింక్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nallari kiran kumar reddy : వైఎస్‌కి లింక్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి

 Authored By sandeep | The Telugu News | Updated on :12 January 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Nallari kiran kumar reddy : వైఎస్‌కి లింక్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి

Nallari kiran kumar reddy : ఈ మ‌ధ్య కాలంలో వైఎస్ ఫ్యామిలీ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.  Ys Jagan జ‌గ‌న్, Ys Sharmila ష‌ర్మిళ మ‌ధ్య చెల‌రేగిన వివాదంతో వారిద్ద‌రి గురించి సోష‌ల్ మీడియాలో Social Media నిత్యం ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంది. అయితే ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుత BJP బీజేపీ నేత అయిన కిరణ్ కుమార్ రెడ్డి Nallari kiran kumar reddy  అప్పట్లో వైఎస్ బతికుంటే ఏం జరిగిందో, తాను ఉండి ఏం చేశానో చెప్పుకొచ్చారు. బెజవాడలో ఆత్మీయ కలయిక లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్న ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది…రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.

Nallari kiran kumar reddy వైఎస్‌కి లింక్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి

Nallari kiran kumar reddy : వైఎస్‌కి లింక్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి

Nallari kiran kumar reddy సంచ‌ల‌న కామెంట్స్..

రాజశేఖర రెడ్డి వెళ్ళే విమానంలో నేను వెళ్ళల్సింది కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూర్పు కోసం ఆగానని… నేను బతికాను కాబట్టే ముఖ్యమంత్రి అయ్యానని అంటూ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి Congress Party ఎప్పుడైనా ముప్పు వస్తే అది బిజెపి వల్లేనని పీవీ నరసింహారావు అనేవారన్నారు. నాకు ముఖ్యమంత్రి సీటు కావాలని ఎవరిని అడగలేదని… రాత్రి 11 గంటల సమయంలో సోనియా గాంధీ నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఏ స్థాయిలో వుంటారో చెప్పలేమని… విభజన సమయంలో ప్రజలు నష్టపోతున్నారని ఆరోజు సిఎం పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు.

రాజీనామా చేస్తున్న సమయంలో కూడా సోనియాకు, రాహుల్ గాంధీకి  Rahul Gandhiదాదాపు 40 నిమిషాల పాటు వివరంగా చెప్పాను… వారు వినలేదని పేర్కొన్నారు. ఏపిని ఎవరు ఇచ్చారు…తెలంగాణను ఏపీలో కలిపింది ఎవరు ? రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత నేను రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. వైఎస్ తర్వాత సీఎంలు అయిన వీరిద్దరూ తెలంగాణ ఏర్పాటను అడ్డుకోలేకపోయారన్న అపప్రద ఎదుర్కొన్నారు. అయితే వైఎస్ బతికున్నా తెలంగాణ ఏర్పాటు మాత్రం ఆగేది కాదంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వెల్లడించారు. దీని వెనుక కారణం కూడా చెప్పేశారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది