Janareddy : రాజకీయాలకు జానారెడ్డి ఇక సెలవు?
Janareddy : జానా రెడ్డి తెలుసు కదా. ఆయన తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత. చాలామంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ల మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆయన రాజకీయాల్లో చాలా సీనియర్. పలు రాజకీయ పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉంది. కానీ.. ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే ఆయన వయసు సహకరించడం లేదు. అందుకే ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా సరే ఒకానొక సమయంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిందే. అందుకే జానా రెడ్డి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఆయన సుదీర్ఘకాలం అంటే 16 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగానూ దరఖాస్తు చేసుకోలేదు. అయితే.. తన కొడుకులు మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారని తెలుస్తోంది. ఆయన ఇక రాజకీయాలకు స్వస్తీ పలకాలని అనుకుంటున్నారట. ఆరేళ్లు అప్పట్లో టీడీపీలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పని చేశారు జానారెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన జానా రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 10 ఏళ్లు మంత్రిగా పని చేశారు.
Janareddy : మిర్యాలగూడ నుంచి తన పెద్ద కొడుకు
మిర్యాలగూడ నుంచి వచ్చే ఎన్నికల్లో జానా రెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కొడుకు జయవీర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన ఇద్దరు కొడుకులకు తన రాజకీయాన్నే వారసత్వంగా ఇచ్చి జానారెడ్డి ఇక రాజకీయాలకు సెలవు ప్రకటించి రెస్ట్ తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?