Nara Lokesh : మళ్లీ మీ జగన్ ఏ కేసులో బొక్కలో వేయమన్నారు.. సీఐడీ అధికారులకు చుక్కలు చూపించిన నారా లోకేష్
Nara Lokesh : ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తో ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడే మంతనాలు జరుపుతున్నారు. కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన ఎలా చంద్రబాబును బయటికి తీసుకురావాలో అక్కడే ఉండి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. చంద్రబాబును అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కింద. ఈ స్కామ్ లో నారా లోకేష్ పేరు కూడా ఉంది. ఇక.. ఈ కేసు ప్రస్తుతం నడుస్తుండగానే మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దానిపై కూడా సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి అందులో కూడా చంద్రబాబు, నారా లోకేష్ పేర్లను చేర్చారు. చంద్రబాబు ఇప్పటికే జైలులో ఉండటంతో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా లోకేష్ కు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. లోకేష్ ఢిల్లీలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఏపీ సీఐడీ అధికారులు నేరుగా లోకేష్ దగ్గరికే నోటీసు తీసుకొని వెళ్లారు.
నేరుగా నోటీసు తీసుకొని లోకేష్ ఉన్న ప్లేస్ కి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏంటి.. ఈ నోటీసు ఇవ్వడం కోసం ఢిల్లీ వరకు వచ్చారా అని లోకేష్ సీఐడీ అధికారులను ప్రశ్నించారు. మాకు ఇప్పటికే వాట్సప్ లో పంపించారు కదా. మళ్లీ ఇదేం కేసు అని లోకేష్ అడగగా.. ఫిజికల్ గా మీకు ఇవ్వాలని వచ్చాం అంటారు సీఐడీ అధికారులు. వాట్సప్ లో పంపించినా కూడా మేము వచ్చి ఇవ్వాలి కదా సార్ అంటారు సీఐడీ అధికారులు. కాఫీ, టీలు ఏమైనా తీసుకుంటారా అని లోకేష్ అడగగా.. ఏం వద్దు సార్ అంటారు సీఐడీ అధికారులు. దీంతో వద్దు సార్ అంటారు. రాకరాక వచ్చారు తీసుకోండి అన్నా కూడా అధికారులు మాత్రం వద్దు అంటారు. నోటీసుల మీద సంతకం పెట్టండి సార్ అని లోకేష్ ను అడగగా.. చదువుకొని పెడతాను సార్ అంటూ లోకేష్ ఆ నోటీసు మొత్తాన్ని చదువుతూ ఉంటాడు.
Nara Lokesh : తప్పు చేశానని మీరు ముందే ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించిన లోకేష్
అందులో మీరు తప్పు చేశారని ముందే ఎలా చెబుతారు అంటూ నారా లోకేష్ వాళ్లను ప్రశ్నించారు. దీంతో భారత ప్రభుత్వం మాకు ఇచ్చే ప్రొఫార్మా అదే సార్.. దాన్ని అలాగే ఎవ్వరికైనా ఇస్తాం అంటూ సీఐడీ అధికారులు లోకేష్ కు చెబుతారు. మొత్తం ముగ్గురు సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కింద లోకేష్ కు నోటీసులు ఇచ్చారు.