Perni Nani : నీ అరెస్ట్ వల్ల నా చేతి రోమాలు కూడా ఊడవు.. కొల్లు రవీంద్రకి పేర్ని నాని పంచ్
ప్రధానాంశాలు:
Perni Nani : నీ అరెస్ట్ వల్ల నా చేతి రోమాలు కూడా ఊడవు.. కొల్లు రవీంద్రకి పేర్ని నాని పంచ్
Perni Nani : ప్రస్తుతం ఏపీలో వైసీపీ Ysrcp , TDP Janasena కూటమి ప్రభుత్వం మధ్య వార్ జోరుగా నడుస్తుంది. ఇటీవల బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని Perni Nani అరెస్ట్ జరగడం ఖాయం అని మంత్రులు కొల్లు రవీంద్ర kollu ravindra , వాసంశెట్టి సుభాష్ అన్నారు. త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని పత్తాలేకుండా పోయారని రవీంద్ర, సుభాష్ ఎద్దేవా చేశారు…..

Perni Nani : నీ అరెస్ట్ వల్ల నా చేతి రోమాలు కూడా ఊడవు.. కొల్లు రవీంద్రకి పేర్ని నాని పంచ్
Perni Nani ఏం చేయలేరు..
చేసిన అరాచకాలకు, అకృత్యాలకు మూల్యం చెల్లించేందుకు కొడాలి నాని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడిన నేతలను ఏమీ చేయడం లేదన్న ఆగ్రహం కూటమి నేతలు, కార్యకర్తల్లో ఉందని… వల్లభనేని వంశీ అరెస్ట్ తో కూటమి శ్రేణుల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్ నుంచి అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నావు. నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవు. అరెస్టులకు భయపడేది లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు..
గత ఏడాది నవంబర్ నుండి అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నావు
నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవు
అరెస్టులకు భయపడేది లేదు
– పేర్ని నాని pic.twitter.com/WSTJKe2L6T
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025