New Scheme : ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు .. లక్ష్యంగా 3.5 కోట్ల ఉద్యోగాలు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Scheme : ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు .. లక్ష్యంగా 3.5 కోట్ల ఉద్యోగాలు!

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  New Scheme : ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు .. లక్ష్యంగా 3.5 కోట్ల ఉద్యోగాలు!

New Scheme : దేశ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (PM Viksit Bharat Rojgar Yojana) పేరుతో కొత్త ఉద్యోగ పథకాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఈ పథకం ద్వారా రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

New Scheme ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు లక్ష్యంగా 35 కోట్ల ఉద్యోగాలు

New Scheme : ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు .. లక్ష్యంగా 3.5 కోట్ల ఉద్యోగాలు!

New Scheme : ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఇది..

ఈ ప్రణాళిక అమలుకు రూ. 99,446 కోట్లు కేటాయిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగం పొందిన ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు ప్రోత్సాహకంగా రూ.15,000 నగదు అందించనున్నారు. అంతేగాక, కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించే సంస్థలకు ఒక్కో ఉద్యోగి కనుక నియమిస్తే, వారికి రూ.3,000 చొప్పున ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించనుంది.

ఉద్యోగరంగాన్ని బలోపేతం చేయడమే కాక, కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణలో భాగంగా ఈ పథకం కీలకంగా మారనుందని కేంద్రం భావిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇది మంచి వేదికగా నిలవనుంది.ఈ ప‌థ‌కంతో చాలా మందికి మంచి చేకూరుతుంద‌ని ఆశిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది