Prakash Raj : సనాతన ధర్మ రక్షణలో మీరుండండి.. సమాజ రక్షణలో మేముంటాం.. పవన్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్..!
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న ట్వీట్ వార్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ సనాతన ధర్మాన్ని రక్షించడం మన అందరి బాధ్యత అంటూ తిరుమల లడ్డూ విషయంలో జరిగిన కల్తీకి తన పరంగా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ప్రకాష్ రాజ్ పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ ని ఉద్దేశిస్తూ కామెంట్ […]
ప్రధానాంశాలు:
Prakash Raj : సనాతన ధర్మ రక్షణలో మీరుండండి.. సమాజ రక్షణలో మేముంటాం.. పవన్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్..!
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న ట్వీట్ వార్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ సనాతన ధర్మాన్ని రక్షించడం మన అందరి బాధ్యత అంటూ తిరుమల లడ్డూ విషయంలో జరిగిన కల్తీకి తన పరంగా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ప్రకాష్ రాజ్ పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు.
ముందు లడ్డూ వివాదంలో ప్రకాష్ రాజ్ కి ఏ సంబంధం ఉందని ఆయన మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ ఇష్యూపై స్పందిస్తున్నారని అన్నారు. ఐతే పవన్ కు ఆన్సర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ వేస్తున్నాడు. నేను చెప్పిందేంటి మీరు అర్ధం చేసుకుంది ఏంటని మొదలు పెట్టిన ప్రకాష్ రాజ్ గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత మరో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
Prakash Raj సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్..
అంతేకాద్ లడ్డూ వివాదంపై సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఈ రాజకీయల్లోకి దేవుడిని లాగకండి అని అన్నారు. ఇక లేటెస్ట్ గా మరోసారి సనాతన ధర్మ రక్షణఓ మీరుండండి.. సమాజ రక్షణలో మేముంటాం అంటూ పరోక్షంగా పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్ వైరల్ గా మారింది.
మరి ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ ఇష్యూ ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు కానీ. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పై పవన్ ఆయన తనకు మంచి మిత్రుడని అన్నారు. మరి తిరుమల లడ్డూ విషయంలో ఒకరిని ఒకరు ఇండైరెక్ట్ గా టార్గెట్ చేయడం ఆడియన్స్ కు భిన్న విధాలుగా మాట్లాడుకుంటున్నారు.