AP : ఏపీలో సైలెంట్ వేవ్.. ఏ పార్టీని ముంచుతుందో..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP : ఏపీలో సైలెంట్ వేవ్.. ఏ పార్టీని ముంచుతుందో..?

 Authored By ramu | The Telugu News | Updated on :14 May 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  AP : ఏపీలో సైలెంట్ వేవ్.. ఏ పార్టీని ముంచుతుందో..?

AP : ఏపీలో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగాయి. గత నెల రోజులుగా ఎవరెన్ని చెప్పాలో అన్నీ చెప్పేశారు. ఎవరెంత ప్రచారం చేసుకోవాల.. ప్రత్యర్థులపై ఎన్ని విమర్శలు, చేయాలో, ఎన్ని ఆరోపణలు చేయాలో అన్నీ చేసేశారు. అందరి మాటలు ప్రజలు విన్నారు. అందరు ఇచ్చిన హామీలను తెలుసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం సెలెంట్ గానే ఉన్నారు. చివరకు మే 13న ఎవరికి ఓటేయాలో వారికి వేసేశారు. అయితే పోలింగ్ డే రోజున పార్టీల అంచనాలు మొత్తం తలకిందులు అయిపోయాయి. ఎందుకంటే అసలు ఓటరు బయటకు రాడేమో అని అంతా అనుకున్నారు.

AP : అన్ని పార్టీలు సైలెంట్..

కానీ మండుటెండలో సైతం ఓటర్లు బయటకు వచ్చారు. ఓటేసి తీరాల్సిందే అన్న రీతిలో వారంతా ఓట్లేశారు. పార్టీల హామీలు, సంక్షేమ పథకాలు ఓటర్లను బయటకు తీసుకురావేమో అని అంతా అనుకున్నారు. కానీ అదే పార్టీల అంచనాలను తలకిందులు చేసి ఓటర్లు సైలెంట్ గా వచ్చి భారీగా ఓట్లేశారు. ఒక రకంగా ఏపీలో సైలెంట్ వేవ్ కనిపించింది. దాంతో అన్ని పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ప్రజల నాడిని పసిగట్టే పనిలో పార్టీలు, రాజకీయ నిపుణులు పడ్డారు. ఎవరికి ఓటేస్తారో కూడా తెలియదని అంతా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ సారి కాస్త పోలింగ్ పెరిగింది.

కాగా పోలింగ్ పెరిగితే గత ఎన్నికల్లో ఏం జరిగిందనేది ఇప్పుడు అంచనా వేస్తున్నారు. గతంలో పోలింగ్ పెరిగితే అది ప్రతిపక్షాలను గెలిపించింది. దాంతో ఈ సారి టీడీపీ కూటమి పెరిగిన ఓటింగ్ తమకే కలిసి వస్తుందని చెబుతోంది. 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆ సైలెంట్ వేవ్ తమకే పడిందని చెబుతోంది. జగన్ ను రెండోసారి సీఎం చేస్తారని అంటోంది. కాస్త మెజార్టీ తగ్గినా సరే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రెండోసారి సీఎం చేసిన విధానంలో భాగంగా ఈ సారి జగన్ కూడా రెండో సారి బొటా బొటి మెజార్టీతో సీఎం అవుతారని అంటోంది.

AP ఏపీలో సైలెంట్ వేవ్ ఏ పార్టీని ముంచుతుందో

AP : ఏపీలో సైలెంట్ వేవ్.. ఏ పార్టీని ముంచుతుందో..?

ఇలా ఏ పార్టీ వారి వాదనలను చెబుతోంది. కానీ ఓటరు ఎటు ఓటేశారనేది మాత్రం అందరికీ అనుమానంగానే ఉంది. ఎటు ఓటేశారో తెలియకపోతే మాత్రం అందరిలోనూ టెన్షన్ తగ్గదు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది