Big Breaking : చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ.. రిమాండ్ పొడిగింపు.. షాక్‌లో టీడీపీ నేతలు
Big Breaking : టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మరోసారి ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ రెండు సార్లు పొగిడించారు. తాజాగా మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రిమాండ్ తాజాగా ముగియడంతో ఏసీబీ కోర్టులో మరోసారి ఆయన రిమాండ్ పొడిగింపుపై విచారణ జరిగింది. దీంతో ఆయన రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది.
మరో 13 రోజులు రిమాండ్ పెంచుతూ.. నవంబర్ 1, 2023 వరకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంచాలని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తనకు జైలులో సరైన సౌకర్యాలు లేవని, సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదని కోర్టుకు తెలిపినా.. ఆ విషయమై లేఖ రాసి తమకు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీఐడీ అధికారులు చంద్రబాబును జైలులోనే విచారించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై చంద్రబాబు ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అయినా కూడా అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారు. ఇంకా విచారణకు సమయం కావాలని ఏసీబీ కోర్టుకు తెలపడంతో ఏసీబీ కోర్టు నవంబర్ 1 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించింది.

tdp president chandrababu remand extended