Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!
ప్రధానాంశాలు:
Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా చర్యలు తీసుకుంటూ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కోర్టుల నుంచి తాత్కాలికంగా ఎదురుదెబ్బలు తగలడంతో కొద్దిరోజుల పాటు కూల్చివేతలు ఆగినప్పటికీ, అక్రమ భూములపై తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవడంలో హైడ్రా అధికారులు చూపుతున్న చురుకుదనం ప్రజల ప్రశంసలందుకుంటోంది.

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!
Boy Saved 39 Acres : బాలుడు రాసిన .. ప్రభుత్వానికి వేల కోట్లను అదా చేసింది..!
తాజాగా లంగర్ హౌస్‌కు చెందిన ఓ బాలుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు రాసిన లేఖ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్నప్పటి నుంచీ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో క్రికెట్ ఆడుతూ వచ్చిన ఆ బాలుడు, ఆ ప్రదేశాన్ని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించి, కంచె వేసి తవ్వకాలు ప్రారంభించిందని లేఖలో పేర్కొన్నాడు. బాలుడి ఆ లేఖను ఆమోదించిన హైడ్రా అధికారులు వెంటనే స్పందించి రంగంలోకి దిగారు.
దర్యాప్తులో ఆ భూమిని నార్నె ఎస్టేట్ అనే సంస్థ అక్రమంగా ఆక్రమించేందుకు యత్నించిందని, మొత్తం 39 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసిందని గుర్తించిన హైడ్రా అధికారులు తక్షణమే కంచెను కూల్చి వేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ. 3,900 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో స్థానిక యువత మరోసారి ఆ ప్రదేశాన్ని ఆటలకోసం వినియోగించుకునే అవకాశం పొందింది. ఒక చిన్నారి తలచిన చర్య, ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధత కలిగి స్పందించిన తీరును ప్రజలు గొప్పగా అభినందిస్తున్నారు.