Union Budget 2024 : రికార్డు బడ్జెట్ తో రికార్డు సృష్టించిన నిర్మలమ్మ.. 4 కోట్ల మందికి ఉపాధి హామీ..!
ప్రధానాంశాలు:
Union Budget 2024 : రికార్డు బడ్జెట్ తో రికార్డు సృష్టించిన నిర్మలమ్మ.. 4 కోట్ల మందికి ఉపాధి హామీ..!
Union Budget 2024 : పార్లమెంట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామాన్ Nirmala Sitharaman ఈ ఇయర్ అనగా 2024 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఈసారి ఆమె ఒక రికార్డ్ నెలకొల్పారు. వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా ఆమె తన పేరు మీద రికార్డు క్రియేట్ చేసుకున్నారు. అత్యధికంగా ఇదివరకు మురర్జీ దేశాయి.. 10 సార్లు ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ రికార్డుకి ఎక్కారు. ఈసారి బడ్జెట్ లో రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. 2024 వార్షిక బడ్జెట్ లో భాగంగా 9 రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మలా సీతారామాన్ వెల్లడించారు. దీని వల్ల ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది. ఇక వీటితో పాటు మరో ముఖ్యమైన నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్‌లో దృష్టి పెట్టామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని మరో అదనంగా ఐదేళ్లు పొడిగించామని వెల్లడించారు
Union Budget 2024 : 4 కోట్ల ఉద్యోగాలు.. స్టార్టప్ లకు ప్రోత్సాహం..
ఉద్యోగం, స్కిల్, ఎంఎస్ఎంఈలపై పూర్తిగా దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించేలా లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. వ్యవసాయ పరిశోధన రంగానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు నిర్మలమ్మ. ప్రకృతి వ్యవసాయం లో కోటి మంది రైతులు నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి కృషి చేసేలా క్లస్టర్ల అభివృద్ధి చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్ కు కూడా ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.
బడ్జెట్ లో ఎక్కువ మధ్యతరగతి పైనే దృష్టి పెట్టామని.. 2 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి నైపుణ్యాలా శిక్షణ ఇతర అవకాశాలు పొందేలా ప్రధానమంత్రి 5 పథకాలు కార్యక్రమాల ప్యాకేజి ప్రకటించారని అన్నారు.