yanamala ramakrishnudu : ఇచ్చింది గోరంత.. దోచుకుంది కొండంత.. జగన్ పై యనమల సంచలన కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

yanamala ramakrishnudu : ఇచ్చింది గోరంత.. దోచుకుంది కొండంత.. జగన్ పై యనమల సంచలన కామెంట్స్

 Authored By brahma | The Telugu News | Updated on :4 March 2021,1:30 pm

yanamala ramakrishnudu : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు, శ్రీ యనమల రామకృష్ణుడు సీఎం జగన్ మోహన్ నిప్పులు చెరిగాడు ఇచ్చింది గోరంత- దోచుకునేది కొండంత అంటూ మాట్లాడాడు. తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, నిత్యావసర సరుకుల ధరల పెంపు వల్ల జగన్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లోనే ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపింది.

yanamala ramakrishndu

ఇసుక ధరలు మూడు రెట్లు పెంచారు. మద్యం క్వార్టర్ పై రూ.100 పెంచారు. పెట్రోల్, డీజిల్ ఒక లీటరుకు రాష్ట్రం అదనంగా రూ.5 పెంచింది. సిమెంట్ బస్తాపై రూ.90 పెంచారు. జగన్ రెడ్డి తెచ్చిన కొత్త ఆస్తిపన్ను చట్టం ప్రకారం ఇప్పుడు ఇంటిపన్ను రూ.10 వేలు చెల్లించే వారు ఏప్రిల్ నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఎడాపెడా ధరలు, పన్నులు, అప్పులు పెంచినా అభివృద్ధి శూన్యమంటూ మాట్లాడాడు.

చంద్రబాబు ఇచ్చిన సంక్షేమం కన్నా తక్కువే ఇచ్చారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, విదేశీ విద్య, పండుగ కానుకల వంటి 34 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ప్రభుత్వానికి పెరిగిన ఆదాయం జే ట్యాక్స్ తో తాడేపల్లి ప్యాలెస్ పరమైంది, వైసీపీ నేతల పరమయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తేనే ఇకపై భారాలు పెంచడానికి భయపడతారు. మున్సిపల్ నిధులు సద్వినియోగం కావాలంటే టీడీపీ అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి అంటూ పిలుపునిచ్చాడు.

yanamala ramakrishnudu : మోసకారి సంక్షేమం

రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు రూ.40 నుంచి రూ.67కు పెంచారు. పంచదార రూ.20 నుంచి రూ.34కు పెంచారు. ఎడంచేత్తో ఇచ్చి కుడిచేత్తో రెట్టింపు గుంజుకోవడం జగన్ రెడ్డి సంక్షేమ బండారం కాదా? అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా ఏడాదికి రూ.36 వేలు గుంజుకుంటున్నారు. నాసిరకం మద్యంపై క్వార్టర్ పై రూ.100 పెంచడం వల్ల జే-ట్యాక్స్ ఏడాదికి రూ.5 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతున్నదని వార్తలు వస్తున్నవి. వాహన మిత్ర అంటూ ఎడమ చేత్తో రూ.10 వేలు ఇచ్చి జరిమానాల పేరుతో రూ.20 వేలు గుంజుకుంటున్నారు. 3 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాల పేరుతో 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి రద్దు చేశారంటూ అంటూ యనమల రామకృష్ణుడు ఘాటైన విమర్శలు చేశాడు ,

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది