Ys Jagan : అమ్మ మంచిదే.. షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది : వైఎస్ జ‌గ‌న్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : అమ్మ మంచిదే.. షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది : వైఎస్ జ‌గ‌న్‌

 Authored By ramu | The Telugu News | Updated on :7 March 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : అమ్మ మంచిదే.. షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది : వైఎస్ జ‌గ‌న్‌

Ys Jagan : వైస్సార్ ఫ్యామిలీలో నెలకొన్నఆస్తుల వివాదంపై సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తల్లి పేరుతో పెట్టిన గిఫ్ట్‌డీడ్ పత్రాలను అడ్డుపెట్టుకుని షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తోందని తాజాగా జగన్ ఆరోపించారు. సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారం కోర్టులో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో జగన్‌ ఎన్సీఎల్టీ (NCLT)లో పిటీషన్‌ దాఖలు చేశారు. ఇందులో తల్లి విజయమ్మను ముందుపెట్టి షర్మిల పంతాలను నెగ్గించుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు…

Ys Jagan అమ్మ మంచిదే షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది వైఎస్ జ‌గ‌న్‌

Ys Jagan : అమ్మ మంచిదే.. షర్మిల అక్రమంగా వాటాలను కాజేయాలని చూస్తుంది : వైఎస్ జ‌గ‌న్‌

గతంలో తల్లి, చెల్లితో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, షర్మిల తన వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ వివాదాన్ని మరింత పెంచిందని జగన్ వివరించారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. కానీ తప్పుడు పత్రాలు, అఫిడవిట్లు సృష్టించి తన వాటాలను కాజేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గిఫ్ట్‌డీడ్ ప్రక్రియ పూర్తికాలేదని, తాను తన వాటాలను అమ్మకు ఇప్పటికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

షర్మిల ఒత్తిడితో తల్లి విజయమ్మ తప్పుదారి పట్టిందని, ఆమె దీనిని సమర్థించుకోవడం బాధాకరమన్నారు. గతంలో షర్మిలపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఇప్పుడు లేవని, ఆమె చేసిన మోసం, అక్రమ చర్యల వల్లే ఈ స్థితి ఏర్పడిందని జగన్ వెల్లడించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది