Ys Jagan : జగన్ పార్టీకి మరో గట్టి దెబ్బ కొట్టిన నిమ్మగడ్డ.. ఈయన మామూలోడు కాదు బాసూ
Ys Jagan : ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయమై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరియు ప్రభుత్వంకు మద్య పెద్ద యుద్దమే జరిగినట్లయ్యింది. న్యాయ పోరాటాల వరకు కూడా వెళ్లారు. అయినా కూడా చివరకు ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ పై నిమ్మగడ్డ రమేష్ పై చేయి సాధించి పంచాయితీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపించాడు. ఈ విషయంలో నిమ్మగడ్డ విజయం సాధించినట్లే అంటూ జగన్ వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలకు భయపడి వైఎస్ జగన్ రకరకాలుగా జిమ్మిక్కులు చేశాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి నిమ్మగడ్డ రమేష్ ఓకే అన్నట్లుగానే అని అనూహ్యంగా మెలిక పెట్టాడు. ఈ విషయంలో వైఎస్ జగన్ కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా నిమ్మగడ్డ వ్యవహరించాడు.
Ys Jagan : నిమ్మగడ్డ ట్విస్ట్‌తో టీడీపీ హ్యాపీ…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం సూచన మేరకు ఎక్కడ నిలిపేయడం జరిగిందో అక్కడ నుండి పునః ప్రారంభించేందుకు నిమ్మగడ్డ ఒప్పుకున్నాడు. గత ఏడాది మార్చిలో ఎన్నికల పక్రియ నామినేషన్ ఉపసంహరణకు ముందు నిలిచి పోయిన విషయం తెల్సిందే. నామినేషన్ ల గడువు పూర్తి అవ్వడంతో ఉపసంహరణ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నామినేషన్ లు వేయని కొందరు ఇప్పుడు నామినేషన్ వేసేందుకు అవకాశం అడుగుతున్నారు. అది ఎలా సాధ్యం అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ గా అది సాధ్యం కాకపోవచ్చు అంటూ వైకాపా నాయకులు అంటూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఎందుకు సాధ్యం కాదు అంటూ నామినేషన్ లు వేసేందుకు అనుమతులు ఇచ్చాడు. దీంతో అప్పుడు ఎవరైతే నామినేషన్ వేయకుండా ఆగారో వారు ఇప్పుడు వేసే అవకాశం దక్కడంతో టీడీపీ ఫుల్ హ్యాపీ.
Ys Jagan : కలెక్టర్లరకు కీలక ఆదేశాలు..
వైకాపా నాయకులు బెదిరించడం వల్ల గత మార్చిలో నామినేషన్ లు వేయలేక పోయాం అంటూ కొందరు టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ వారికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా ఆ స మయంలో నామినేషన్ వేసేందుకు ఎవరైనా అడ్డు వచ్చి ఉంటే ఆ విషయాన్ని సాక్ష్యాధారాలతో కలెక్టర్లకు చూపించి మళ్లీ నామినేషన్ వేసే అవకాశం ఉంది. గతంలో బెదిరింపులకు పాల్పడ్డ వైకాపా నాయకులు మళ్లీ బెదిరింపులకు పాల్పడకుండా తాము రక్షణ కల్పిస్తామని నిమ్మగడ్డ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు నామినేషన్ వేసేందుకు సిద్దం అవుతున్నారు. మరి కలెక్టర్లు వారి నామినేషన్ లపై ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.