YS Sharmila : పాలేరు బరి నుంచి తప్పుకున్న వైఎస్ షర్మిల? కారణం అదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : పాలేరు బరి నుంచి తప్పుకున్న వైఎస్ షర్మిల? కారణం అదేనా?

 Authored By kranthi | The Telugu News | Updated on :27 October 2023,3:15 pm

ప్రధానాంశాలు:

  •  పాలేరు నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?

  •  షర్మిలను కావాలని పాలేరు నుంచి తప్పించారా?

  •  వైఎస్సార్టీపీ అసలు పోటీ చేస్తుందా? లేదా?

YS Sharmila : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా సరిగ్గా నెల రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇంకో నెల రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వాలే మారే అవకాశం ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక ఈసారి కాంగ్రెస్ కు కట్టబెడుతుందా? అనేది వేచి చూడాలి. అయితే.. ఆ మధ్య తెలంగాణలో పార్టీ పెట్టి హడావుడి చేసిన వైఎస్ షర్మిల.. తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల పోటీ కోసం ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్టీపీ పార్టీ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దింపుతామని.. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు.. తన తల్లి విజయమ్మ, తన భర్త అనీల్ కూడా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడతారని స్పష్టం చేశారు షర్మిల.

కానీ.. పాలేరు నుంచి తాను పోటీ చేయడం లేదట. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం షర్మిల పాలేరు బరి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. తొలి నుంచి పాలేరులోనే తాను పోటీ చేస్తా అని ప్రకటించుకున్న షర్మిల.. ఎన్నికలకు నెల రోజుల ముందు ఎందుకు పాలేరు నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించింది అనే దానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా షర్మిల పాలేరు బరి నుంచి తప్పుకోవడం అనేది పాలేరు రాజకీయాలకు కీలక మలుపు తిప్పనున్నాయి. ఏది ఏమైనా పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తే అక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంది. ఓట్లు చీలి అది ఇతర పార్టీలకు మైనస్ అయ్యే అవకాశం ఉన్నందున కావాలని ఇతర పార్టీ నాయకులు పాలేరు నుంచి షర్మిలను పోటీ చేయనీయకుండా తప్పించారా అనేది తెలియాల్సి ఉంది.

పాలేరులో పోటీ చేయకపోతే మరి ఏ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు. అలాగే.. వైఎస్సార్టీపీ పార్టీకి ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. దీంతో తనకు బైనాక్యులర్ గుర్తు వద్దని.. షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి మరో గుర్తు కేటాయించాలని షర్మిల సీఈసీని ఆశ్రయించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది