Ys jagan : వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా తిరుపతిలో ఎమ్మెల్యేలు భేటీ.. తెరపైకి గురుమూర్తి
Ys Jagan : మొన్న ఈ మధ్య రిపబ్లిక్ టీవీలో వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. మరికొద్ది రోజుల్లో వైసీపీ లో తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉందని ఆ ఛానల్ కథనాలు ప్రచారం చేసింది. దానిని వైసీపీ నేతలు ఖండించిన విషయం కూడా తెలిసిందే, అయితే తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్బంగా జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే ఈ వార్తల్లో నిజముందని తెలుస్తుంది.
ఆ ముగ్గురు రహస్య భేటీ
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో ఆ పార్లమెంట్ పరిధికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి, తాము లేనిదే ఇక్కడ వైసీపీ గెలవదని తమతోనే పార్టీ డెవలప్ అయిందని అనుకున్నారట. అంతేకాకుండా తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద డిమాండ్ చేయాలని అనుకున్నారట.ఇంటలీజెన్స్ వర్గాల ద్వారా వైఎస్ జగన్ కు ఈ సమాచారం చేరుకోవడంతో జగన్ అప్రమత్తమయ్యారట. అప్పటికే జగన్ మనసులో ఉన్న గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడి ఎమ్మెల్యేలు మంత్రులు షాక్ కు గురయ్యారు.
అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, గురుమూర్తిని గెలిపించవల్సిన బాధ్యత జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించాడు జగన్. దీనితో ఇక వాళ్ళు చేసేది ఏమి లేక మౌనంగా సరే అని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే వైసీపీ లో చిన్నపాటి వ్యతిరేకత జగన్ మీద ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది.
జగన్ పక్క ప్లాన్
తన మీద ఎంత వరకు వ్యతిరేకత ఉంది అనే విషయం కూడా సీఎం జగన్ కు తెలిసే ఉంటుంది. అందుకే సొంత పార్టీలో కూడా జగన్ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఫిజియోథెరపిస్టు అయిన గురుమూర్తిని పిలిచి మరి ఎంపీ టిక్కెట్ ఇచ్చాడు జగన్. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు పాదయాత్ర చేసిన విషయం తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఫిజియోథెరఫిస్ట్ గురుమూర్తి.. చెల్లెలు షర్మిలకు వైద్యుడిగా ఉన్నారు. ఆ తరువాత జగన్ కు కూడా వైద్యం అందించారు. ఆయన చేసిన సేవలకు వైద్య రంగంలో ఏదో ఒక పదోన్నతి కల్పించాలని భావించారు. ఇంతలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనితో ఈ స్థానం గురుమూర్తికి ఇచ్చాడు జగన్.
ఒక్క గురుమూర్తి మాత్రమే కాదు. వైసీపీ లో కార్పొరేటర్లు నుండి మంత్రుల వరకు పెద్దగా రాజకీయానుభవం లేని నేతలకు జగన్ అవకాశాలు ఇస్తున్నాడు. దీనితో ఆయా నేతలు ఎప్పటికి కూడా జగన్ మాట దాటిపోకుండా నిబద్దతతో పనిచేస్తారు. గతంలో ఇందిరాగాంధీ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు ఇలాంటి రాజకీయాలే చేశారు . అందుకే వాళ్ళు చనిపోయిన కానీ వాళ్ళ హయాంలో రాజకీయంగా ఎదిగిన నేతల్లో ఎక్కువ మంది ఇప్పటికి అవే పార్టీలో కొనసాగుతున్నారు .