8 Vasanthalu Movie Review : OTT ప్రేక్షకుల ముందుకు రానున్న‌ 8 వసంతాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

8 Vasanthalu Movie Review : OTT ప్రేక్షకుల ముందుకు రానున్న‌ 8 వసంతాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2025,10:08 am

ప్రధానాంశాలు:

  •  8 Vasanthalu Movie Review : చక్కటి వసంతం 8 వసంతాలు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

8 Vasanthalu Movie Review : ‘MAD’ ఫేమ్ అనంతికా సానిల్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘8 వసంతాలు’ చిత్రం ఈరోజు (జులై 11) OTT ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫణీంద్ర నర్సేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో, ఒక అమ్మాయి జీవితంలోని ఎనిమిది సంవత్సరాల ప్రయాణం, ప్రేమ, విడిపోవడం, ఆత్మ అన్వేషణ వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.

8 Vasanthalu Movie Review OTT ప్రేక్షకుల ముందుకు రానున్న‌ 8 వసంతాలు

8 Vasanthalu Movie Review : OTT ప్రేక్షకుల ముందుకు రానున్న‌ 8 వసంతాలు..!

8 Vasanthalu Movie Review : కథ విషయానికి వస్తే..

సుద్ధి అయోధ్య (అనంతికా) ఓటీ లో నివసించే 17 ఏళ్ల అమ్మాయి. డోజో చాంప్, రచయిత కావాలని ఆశపడే స్వతంత్ర స్వభావం ఉన్న ఈ అమ్మాయి జీవితంలో కార్తిక్ (హను రెడ్డి) ప్రవేశిస్తాడు. ఈ పరిచయం ఆమె జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తుంది. వీరిద్దరి మధ్య భావోద్వేగాలతో నిండిన సంబంధం ఎనిమిదేళ్ల కాలంలో ఎలా మారుతుందనేదే ఈ కథ ముడిపడి ఉంటుంది.

8 Vasanthalu Movie Review ప్లస్ పాయింట్లు:

అనంతికా తన పాత్రకు న్యాయం చేసింది. 17 ఏళ్ల వయస్సులో సుద్ధిగా కనిపించాల్సిన లోతైన భావోద్వేగాలను కీలక పాత్ర పోషించింది. ఆమె నటన, ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకి బలంగా నిలిచాయి.
హను రెడ్డి పాత్రకు తగిన ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. అతడి ప్రదర్శన, ముఖ్యంగా అనంతికాతో కలిసి ఉన్న సన్నివేశాలు, ఇంటర్వెల్ వరకు భావోద్వేగాలకు బలంగా నిలిచాయి. ఊటి, వారణాసి, కాశ్మీర్ లొకేషన్లను అద్భుతంగా చిత్రీకరించారు. విజువల్స్ కథ యొక్క బేస్ ను బలపరుస్తూ ఆకట్టుంది. అబ్దుల్ వహాబ్ సంగీతం సంగీతప్రియుల మనసు దోచుతుంది. కొన్ని పాటలు కథనంలో బాగా లీనమై పోయేలా రూపొందించారు.

మైనస్ పాయింట్లు :

కథ నరేషన్ నెమ్మదిగా సాగడంతో ఆసక్తిని కోల్పోయేలా చేసింది. మొదటి భాగం కొంత ఆసక్తికరంగా సాగినప్పటికీ, రెండో భాగం ముందుకు వెళ్లే కొద్దీ ఊహలకే పరిమితమవుతుంది. సుద్ధి క్యారెక్టర్ ప్రారంభంలో బలంగా ఉన్నప్పటికీ, బ్రేకప్ తరువాత ఆమె తీసుకునే నిర్ణయాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలా ధైర్యంగా ఉండే అమ్మాయి ఒక్కసారిగా తల్లి చెప్పినట్టు ఒప్పుకోవడం సహజంగా అనిపించదు. రవి దుగ్గిరాల పాత్ర సినిమా చివరిభాగంలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, అతడి లెటర్ భావోద్వేగంగా ఉన్నా, కథతో అంతగా అనుసంధానం కలిగించలేకపోయింది. సపోర్టింగ్ క్యారెక్టర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎడిటింగ్ లో మరికొన్ని సన్నివేశాలు తగ్గించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లవర్ బాయ్ కనిపించిన హను రెడ్డి ప్రేమకథలకి తగ్గ హీరో అనిపిస్తాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. భావోద్వేగాలతోనూ మెప్పిస్తాడు. మరో నటుడు రవి దుగ్గిరాల తన పాత్రకు న్యాయం చేశాడు. విశ్వనాధ్ రెడ్డి కెమెరా పనితనం అద్భుతం అనిపిస్తుంది. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి కవితాత్మక స్పర్శతో కథని చెప్పాలనుకోవడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. అయన సంభాషణలు చాలాచోట్ల ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ఈ 8 వసంతాలు ప్రేక్షకులను అందంగా కట్టేసి సినిమా.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది