Bhala Thandanana Movie Review : భళా తందనాన మూవీ రివ్యూ , రేటింగ్..!
Bhala Thandanana Movie Review : శ్రీవిష్ణు హిట్స్, ఫ్లాప్స్ తేడాలేకుండా సినిమాలు చేస్తున్నారు. చివరగా `అర్జున ఫల్గునా` చిత్రంతో నిరాశ పరిచిన ఆయన ఇప్పుడు `భళా తందనాన` చిత్రంతో వస్తున్నారు. కేథరిన్ థ్రెస్సా కథానాయికగా నటించగా, `బాణం` చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం(మే 6న) విడుదలైంది. గత చిత్రంతో నిరాశ పరిచిన శ్రీవిష్ణు `భళా తందనాన`తో మెప్పించాడా..!
కథ : విజయానందం చారిటబుల్ ట్రస్ట్‌లో చందు (శ్రీవిష్ణు) అకౌంటెంట్‌గా వర్క్ చేస్తుంటాడు. ఆ టస్ట్ ఓనర్ (పోసాని)కి సోసైటీలో చాలా మంచి పేరుంటుంది. తనకు క్రైమ్ జర్నలిస్ట్ శశిరేఖ (క్యాథిరన్ ట్రెసా)తో పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో సిటీలోనే పేరు మోసిన వ్యక్తి ఆనంద్ బాలి(రామచంద్రరాజు). అతనొక హవాలా కింగ్. అతను చాలా మందిని చంపేస్తూ ఉంటాడు. క్రైమ్ జర్నలిస్ట్‌గా ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటుంది శశిరేఖ. ఆమెకు చందు సాయం చేస్తుంటాడు. ఓ సందర్భంలో ఆనంద్ బాలికి సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల హవాలా మనీని ఎవరో దొంగిలించారనే విషయం శశిరేఖకు తెలుస్తుంది. ఆ సమయంలో చందుని కిడ్నాప్ చేస్తారు. ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పర్‌ఫార్మెన్స్: శ్రీవిష్ణు పాత్రలో ఒదిగిపోయారు. ఫస్టాఫ్ అమాయకుడైన పల్లెటూరి కుర్రాడిలా.. సెకండాఫ్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటి వరకు తను చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో శ్రీవిష్ణు క్యారెక్టర్‌లో హీరోయిజంకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు చైతన్య దంతులూరి. క్యాథరిన్ ట్రెసా నటన పరంగా మెప్పించే ప్రయత్నం చేయటమే కాకుండా తన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పింది సీరియస్ విలన్‌గా రామచంద్రరాజు, కామెడీ పండిస్తూ విలనిజం చేసే వ్యక్తిగా పోసాని పాత్రలు ఆకట్టుకుంటాయి.
సాంకేతికం : మణిశర్మ సంగీతంలో రాశానిలా.. అనే లవ్ ఎక్సెప్రెషన్ సాంగ్ చాలా బావుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బావుంది. సినిమా అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు. హీరో అమాయకంగా కనిపిస్తూ వేరియేషన్ చూపించటం.. పాత్రల్లో ఇన్‌టెన్సిటీ కనిపించదు. నెక్ట్స్ ఏం జరుగుతుందని అనిపించలేదు. స్క్రీన్ ప్లే స్పీడు లేదనిపించింది. క్యాథరిన్ హీరో పక్కన మరీ బొద్దుగా కనిపించింది. ఏదేమైనా కానీ నా ఎక్స్‌ప్రెషన్ నాదే అన్న తీరులో కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన కనిపిస్తుంది.
సినిమాకి అసలు హీరో ఎవరు? అతను విలన్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? అనేవి చూపించలేదు. ఇవి సినిమాలో పెద్ద మైనస్. సినిమా చివరిలో `భళా తందనాన` సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. బహుశా పార్ట్-2 లో చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రివీల్ చేయలేదేమో. ఆడియెన్స్ కి కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ మిస్ అవుతుంది. భళా అని మాత్రం ఈ సినిమా అనిపించుకోదనే చెప్పాలి.