Brahmastra Movie Review : బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ & రేటింగ్…!
Brahmastra Movie Review : రిలీజ్ డేట్: 2022, సెప్టెంబర్ 9
నటినటులు: రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబచ్చన్, నాగార్జున, మౌని రాయ్ తదితరులు.
డైరెక్టర్: అయాన్ ముఖర్జీ
నిర్మాతలు: మరిఙ్కే డిసోజా, కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ.
మ్యూజిక్ డైరెక్టర్: ప్రీతమ్ చక్రబోర్టీ
సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ, పంకజ్ కుమార్, మణికందన్, వికాష్ నౌలాఖ.
కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో మంచి సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా రావడం లేదు. ఖాన్ హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుండడం వారిని కలవరపరుస్తుంది.అయితే భారీ అంచనాల నడుమ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో బ్రహ్మాస్త్రా అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ : బ్రహ్మస్త్రాని కాపాడుతున్న బ్రహ్మాన్ష్ చుట్టూ మూవీ కథ నడుస్తుంది. బ్రహ్మాస్త్రా మూడు ముక్కలుగా చేయబడగా, తొలి పార్ట్ అనీష్(నాగార్జున) వద్ద ఉండగా రెండవ భాగం మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్) అనే శాస్త్రవేత్త వద్ద ఉంటుంది. అయితే వీటిని కలిపి పవర్ ఫుల్ శక్తిని పొందాలని మౌనీరాయ్ అండ్ టీం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. డీజే శివ(రణబీర్ కపూర్) వారికి అడ్డుపడతాడు. అసలు కాన్సెప్ట్ ఎలా మొదలవుతుంది.. ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి.. ఎవరికీ ఏం జరుగుతుంది అనేది అసలైన కథలో చూడవచ్చు.
పనితీరు : అందరు తమ తమ పాత్రలలో చక్కని ప్రతిభ కనబరిచారు. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక అమితాబచ్చన్ యొక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశారు. ఇక నాగార్జున మరియు షారుఖ్ ఖాన్ లతో పాటు మౌనీ రాయ్ నటన ఆకట్టుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ కథ మరియు స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది. పాటలు కొన్ని పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. వాటి చిత్రీకరణ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పలు సన్నివేశాలను చాలా గ్రాండ్ గా చూపించాడు. ఎడిటింగ్ లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించింది. కథనంపై మరింత దృష్టి పెడితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ : రణబీర్ కపూర్, అలియా, అమితాబ్
వీఎఫ్‌ఎక్స్ వర్క్
మైనస్ పాయింట్స్ : కథ, కథనం,
ఎడిటింగ్
చివరిగా : కథలో కొత్తదనం లేకుండా సినిమాపై ఎంత హైప్ తెచ్చిన ప్రయోజనం ఉండదు అని బ్రహ్మాస్త్రాతో మరోసారి నిరూపితం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు ఇందులో.. భారీ కాస్టింగ్ ఉండటం వల్ల ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకున్నా స్టోరీ విషయంలో పూర్తిగా తేలిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ లేజర్ షోని తలపించేలా, లైట్ సెట్టింగ్ ని తలపించేలా ఉన్నాయి. బిజియం ఇంకా బావుండాల్సింది.
రేటింగ్: 2/5