Family Star Movie Review : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Family Star Movie Review : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Family Star Movie Review : వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో కలిసి పరుశురామ్ కాంబోలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశాడు. దిల్ రాజు నిర్మించిన చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే దిల్ రాజు ప్రమోషన్స్‌ను పీక్స్‌కు చేర్చాడు. ఇది వరకెన్నడూ లేని విధంగా ప్రమోషన్స్‌లో డ్యాన్సులు కూడా వేశాడు దిల్ రాజు. సినిమా బాగా వచ్చిందని, ప్రతీ ఫ్యామిలీకీ సినిమా కనెక్ట్ అవుతుందని, కచ్చితంగా సక్సెస్ కొడుతున్నామనే కాన్ఫిడెన్స్‌తో ఆయన కనిపిస్తున్నారు. దిల్ రాజుతో విజయ్ దేవరకొండ కూడా చాలా ధీమాగా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్లలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీన్‌కు రిలేట్ అవుతారని, అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయని అంటున్నారు. ప్రతీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఫ్యామిలీ స్టార్ ఉంటారని దిల్ రాజు, విజయ్ ఇద్దరూ చెబుతూనే వచ్చారు.
Family Star Movie Review ఏప్రిల్ 5 న ఈ సినిమా విడుదల
నటీనటులు: విజయ్ దేవరకొండ vijay devarakonda , మృణాళ్ ఠాకూర్ mrunal thakur
దర్శకుడు: పరశురామ్
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: దిల్ రాజు Dil raju
ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్.. సినిమా పై అంచనాలు పెంచాయి అని చెప్పాలి. ఏప్రిల్ 5 న ఈ సినిమా ఉగాది కానుకగా రాబోతున్న ఈ చిత్రాన్ని వీక్షించిన కొందరు ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా కామెడీతో సాగిందని ఇందులో విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్, అతని నటన ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెబుతున్నారు..యాక్షన్ సీక్వెన్స్..లతో అతను మాస్ ఆడియన్స్ ని కూడా దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. ఇక చిత్రంలో హీరోయిన్ మృణాల్.. హీరోని ‘ఏవండీ’ అని పదే పదే పిలవడం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతగానో కనెక్ట్ అవుతుందని సమాచారం.

Family Star Movie Review : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
బాగా కనెక్ట్ అవుతుంది.. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా సాగుతుందట.క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది అంటున్నారు. కథలో కొంచెం చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ పోలికలు ఉన్నప్పటికీ.. పరశురామ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందని చెబుతున్నారు.ఈ మూవీ ఫ్యామీలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకోవడంతో కలెక్షన్స్ భారీగానే రాబడుతుందని సమాచారం. మంచి విజయం సాధించే ఈ మూవీకి ఏ అవార్డు వచ్చినా కూడా అది పరుశురామ్‌కు దక్కుతుందని, విజయ్ స్టేజ్ మీద చెప్పిన సంగతి తెలిసిందే.. గీతగోవిందం తరువాత విజయ్ దేవరకొండ, పరుశురామ్ కలిసి చేసిన చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉండగా,ఆ అంచనాలకి తగ్గట్టే మూవీ ఉందని తెలుస్తుంది.
Family Star Movie Review కథ
ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఇందులో విజయ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిలా కనిపిస్తాడు. అనేక ఇబ్బందులు ఆయనకి ఎదురవుతుంటాయి. ఫ్యామిలీ సమస్యలతో నలిగిపోతున్న విజయ్ దేవరకొండకి ఏ రోజు కూడా మనశ్శాంతి ఉండదు. ఇక ఫ్యామిలీ సమస్యల వలన విజయ్ దేవరకొండ, మృణాల్ మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ తన సమస్యలని సాల్వ్ చేసుకున్నాడా, మృణాల్‌తో కలిసి ఉన్నాడా, లేక విడిపోయాడా వంటి అంశాలని దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. పూర్తి విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Family Star Movie Review విశ్లేషణ
కమర్షియల్ సినిమాలను తీయడంలో పరుశురాం దిట్ట అని చెప్పాలి. విజయ్ తో ఈయన చేసిన గీతా గోవిందం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మినిమం అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మాత్రం భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ తన పర్‌ఫార్మెన్స్ ఇరగదీసాడు. దర్శకుడు ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని ఎంటర్ టైన్ మెంట్ వే లో నడిపించగా, సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చి వదిలేసాడు. విజయ్, మృణాల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలతో పాటు సంభాషణలు రక్తి కట్టిస్తాయి. కొన్ని సంభాషణలు ప్రేక్షకుల చేత కంటతడి కూడా పెట్టిస్తాయి.
సినిమా ఎక్కడ కూడా బోరింగ్ రాకుండా చేశాడు పరశురాం. స్క్రీన్ ప్లే లో ఆయన అనుసరించిన విధానం బాగుండడంతో కొన్నిచోట్ల ప్రేక్షకులు విజిల్స్ కూడా వేస్తారు. పరశురాం గత చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశాడో అవి ఇక్కడ చేయకుండా చాలా చక్కగా నడిపించాడు. ఇక గోపిసుందర్ సంగీతం కూడా సినిమాకి ప్లస్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆయన కనిపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక మృణాల్ ఠాకూర్ తన అందంచ అభినయంతో ఆకట్టుకుంది. సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా మంచిగా నటించారు. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన కేయూ మోహనన్ కూడా అద్భుతమైన విజువల్స్ ని అందించి సినిమా సక్సెస్లో సగభాగం అయ్యారు. మార్తాడు కె వెంకటేష్ చేసిన ఎడిటింగ్ అయితే సినిమాకు సరిగ్గా యాప్టయింది.
ప్లస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
విజయ్ ,మృణల్ ఠాకూర్
ఎమోషనల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
స్లో నరేషన్…
గోపి సుందర్ మ్యూజిక్
చివరిగా.. ఫ్యామిలీ స్టోరీ సినిమాలని ఇష్టపడే వారు ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఈ మూవీని చూడవచ్చు
రేటింగ్
2.75/5