Maha Samudram Movie Review : మహాసముద్రం సినిమా రివ్యూ.. టాలీవుడ్ గర్వించదగ్గ సినిమా..!
Maha Samudram Movie Review , మహాసముద్రం సినిమా రివ్యూ, మహాసముద్రం అనే సినిమాను విడుదల చేయడానికి డైరెక్టర్ అజయ్ భూపతి కనీసం మూడేళ్ల సమయం తీసుకున్నాడు. ఆయన తొలి సినిమా ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత అజయ్ తీసే సినిమా ఎలా ఉంటుంది…. అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన సినిమా మహాసముద్రం. నిజానికి.. తన తొలి సినిమా ఆర్ఎక్స్ 100కు, తాజా సినిమా మహాసముద్రానికి ఏమాత్రం పోలికలు ఉండవు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? ఈ సినిమాకు ఇద్దరు హీరోలా? లేక ఒకరు హీరో? మరొకరు విలనా? ఏంటి.. అసలు సినిమా కథ ఏంటో తెలుసుకుందాం రండి.
కథ
సినిమా కథ గురించి చెప్పాలంటే.. ఇది ఒక లవ్ స్టోరీ. కాకపోతే సాదాసీదా లవ్ స్టోరీ మాత్రం కాదు. ఒక ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ. అది ఇద్దరు వ్యక్తుల కథ. సంబంధంలేని వేర్వేరు రూట్లలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అప్పుడు వీళ్ల జీవితంలో అనుకోని కొన్ని ఘటనలు జరుగుతాయి. అప్పుడే వీళ్లిద్దరికి గూడు బాబ్జీ(రావు రమేశ్)తో గొడవలు ప్రారంభం అవుతాయి. తమ ప్రేమ కోసం ఇద్దరూ ఒక్కటవుతారా? ఆ ఇద్దరూ కలిసి గూడు బాబ్జీని ఎలా ఎదుర్కొంటారు? ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? తమ ప్రేమను గెలిపించుకుంటారా? అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్
సినిమాకు ప్లస్ పాయింట్స్ శర్వానంద్, సిద్ధార్థ్. ఈ సినిమాలో వీళ్లు హీరోలా.. లేక విలన్సా? అనేది పక్కన పెడితే… ఈ సినిమాలో వాళ్ల క్యారెక్టర్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. గూడు బాబ్జి ఎంట్రీతోనే సినిమా రేంజ్ మారిపోతుంది. ఇంటర్వల్ వరకు ప్రేక్షకుడు అలా కూర్చొని సినిమాను చూస్తుండిపోతాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ ను పండిస్తుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్, ఇంటర్వల్ బ్యాంగ్, ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్రాణం. ఇక.. సినిమా నటులు శర్వా, సిద్ధార్థ్ తో పాటు అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరిల నటన కూడా సూపర్బ్ గా ఉంటుంది.
మైనస్ పాయింట్స్
సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే.. స్టోరీ నరేషన్ గురించి చెప్పుకోవచ్చు. స్టోరీ నరేషన్ మాత్రం కాస్త స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. కామెడీ కాస్త తగ్గడం, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఎక్కువ కావడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు.
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. మహా సముద్రం సినిమాను హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మహా సముద్రం లోతును మనం ఎలా కనుక్కోలేమో…. ఈ సినిమాలోని ప్రేమ లోతును కూడా తెలుసుకోలేం.