Maha Samudram Movie Review : మహా సముద్రం మూవీ రివ్యూ , లైవ్ అప్‌డేట్స్..!
Maha Samudram Movie Review : మహా సముద్రం రివ్యూ .. శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Maha Samudram Movie Review : మహా సముద్రం రివ్యూ
దసరా కానుకగా నేడు (అక్టోబర్ 14) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి.ఇక యూఎస్‌లో అయితే సినిమా మీద మంచి టాక్ ఏర్పడింది. ట్విట్టర్‌లో సినిమా గురించి జనాలు బాగానే మాట్లాడుకుంటున్నారు. ట్విట్టర్‌లోసినిమా టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.ప్రమోషన్స్‌లో సినిమా గురించి చెప్పిన మాటలు, తెరపై కనిపిస్తున్న దానికి పొంతన లేదని కొందరు అంటున్నారు. అయితే ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయిందనరి అంటున్నారు.
అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రథమార్థం ముగుస్తుందని చెబుతున్నారు. సిద్దార్థ్, శర్వానంద్ కలిసి ఉన్న సీన్లు మాత్రం అద్భుతంగా వచ్చాయని మాట్లాడుకుంటున్నారు.ఇక రావు రమేష్, జగపతి బాబు నటన మాత్రం అదిరిపోయిందని చెబుతున్నారు. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చింపేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి మరోసారి తన సత్తా చాటాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో రాబోతోంది.
పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి