Game Changer Movie Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ..!
ప్రధానాంశాలు:
Game Changer Movie Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ..!
Game Changer Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 21న డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రం గేమ్ ఛేంజర్. ఆంధ్రప్రదేశ్ లో కూడా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. జనవరి 4న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరగబోతోంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా పక్కా హిట్ అని ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ దర్శకుడు శంకర్‌కు ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ లేదు.
Game Changer Movie Review రామ్ చరణ్ నటన అదుర్స్..
భారీ బడ్జెట్‌తో చిత్రాలు తెరకెక్కించినా అవి వర్కవుట్ అవ్వకపోవడంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. అందుకే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే ముందుగా ప్రేక్షకులు ఎగ్జైట్ అయినా.. అసలు ఫామ్‌లో లేని దర్శకుడితో చరణ్ సినిమా చేస్తున్నాడని కాస్త టెన్షన్ పడ్డారు కూడా. కానీ ‘గేమ్ ఛేంజర్’తో శంకర్ మళ్లీ ఫామ్‌లోకి రానున్నాడని తెలుస్తోంది. మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ బయటకు రావడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని తేలిపోయింది. అంతే కాకుండా ఈ మూవీలో హైలెట్స్ ఏంటనే విషయం కూడా బయటికొచ్చింది.
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి సినిమా మహాద్భుతం అంటూ చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో చెబుతున్నారు. శంకర్ కంబ్యాక్ గ్యారెంటీ అని అంటున్నారు. దీనికి తోడు యుఎస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా గేమ్ ఛేంజర్ చిత్రం అదిరిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు.రాంచరణ్ నటన అవార్డులు గెలుచుకునేలా ఉందని చెప్పారు. ఫస్టాఫ్ లో రాంచరణ్ కాలేజ్ డేస్ పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూ నెమ్మదిగా కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ మొత్తం ఎంగేజింగ్ గా ఉండదు కానీ ఓవరాల్ గా అబౌ యావరేజ్ అన్నట్లుగా ఉంటుందట. అది కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ పడడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. గేమ్ మొత్తం మారిపోయేది సెకండ్ హాఫ్ లోనే అని అంటున్నారు. అప్పన్న పాత్రతో ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. పొలిటికల్ సన్నివేశాలని శంకర్ బాగా డీల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాతో జాతీయ అవార్డు వస్తుందని చెప్పారు. చిత్ర యూనిట్ కూడా అదే చెబుతోంది.