Thank You Movie Review : నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thank You Movie Review : నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ రివ్యూ..!

 Authored By aruna | The Telugu News | Updated on :22 July 2022,12:19 am

Thank You Movie Review : నాగచైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ థాంక్యూ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 22 న రిలీజ్ కాబోతోంది. కానీ.. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. దీంతో ఒకరోజు ముందే సినిమా ఎలా ఉందో అందరికీ తెలిసిపోయింది. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఆయన వినూత్నమైన సినిమాలకు పెట్టింది పేరు. మనం సినిమాను కూడా విక్రమ్ తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. తాజాగా నాగచైతన్యతో థాంక్యూ అంటూ వచ్చేశాడు విక్రమ్. ఇది రొమాంటిక్ కామెడీ ఫిలింగా తెరకెక్కింది. జీవితంలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎవ్వరూ ఎదగలేరు. సక్సెస్ కాలేరు.

మన సక్సెస్ కు కారణమైన వాళ్లను అస్సలు మరిచిపోకూడదు.. అంటూ చెప్పేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశీ ఖన్నా, అవికా గోర్, మాలవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రీమియర్ షోలను ఇప్పటికే వేశారు. రాత్రి 9.30 కే బెనిఫిట్ షోను ఇండియాలో, యూఎస్ లో ప్రీమియర్ షోలను వేశారు. దీంతో సినిమా స్టోరీ ఏంటి.. సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి.. సినిమా లైవ్ అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

thank you movie review and live updates

thank you movie review and live updates

Thank You Movie Review : సినిమా లైవ్ అప్ డేట్స్

సినిమా పేరు : థాంక్యూ
నటీనటులు : నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాశ్ రాజ్
డైరెక్టర్ : విక్రమ్ కే కుమార్
నిర్మాతలు : రాజు, శిరీష్
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్
రిలీజ్ డేట్ : 22 జులై 2022

సినిమా ప్రారంభమే నాగచైతన్య(అభి)తో స్టార్ట్ అవుతుంది. నాగ చైతన్య గురించి బ్యాక్ స్టోరీ వస్తుంది. తను యూఎస్ నుంచి న్యూయార్క్ కు వెళ్తుండగా తన గతాన్ని అభి గుర్తు చేసుకుంటాడు.

ఇంతలో అభికి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. డయాగ్నొస్టిక్ యాప్ ను డెవలప్ చేయాలనుకుంటాడు అభి. తనకు రాశీ ఖన్నా సపోర్ట్ చేస్తుంది. ఫండింగ్ కూడా తనే చూసుకుంటుంది. దీంతో యాప్ ను అభి డెవలప్ చేస్తాడు.
ఆ తర్వాత ఒక నిమిషం సాంగ్ వస్తుంది. ఆ తర్వాత అభి ప్రవర్తనలో ఏదో తేడా వస్తుంది.

కన్సల్టింగ్ కంపెనీకి ప్రకాశ్ రాజ్ ఓనర్ గా ఉంటాడు. అయితే.. యూఎస్ లో కన్సల్టింగ్ కంపెనీలు ఎలా వర్క్ అవుతాయో దర్శకుడు సరిగ్గా చూపించలేకపోయాడు.

ఆ తర్వాత అభి కాలేజీ రోజుల ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అక్కడే కాలేజీలో మాలవికా నాయర్ ను అభి కలుస్తాడు. అభి కాలేజీలో టాపర్, స్పోర్ట్స్ లోనూ టాపర్.

ప్రస్తుతం అభి అనుభవిస్తున్న సక్సెస్ కు కారణం ఎవరు, తన ప్రస్తుత పొజిషన్ కు కారణం ఎవరో అభి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇంతలో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది.

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఏంటంటే.. అభి తన సక్సెస్ కు ఎవరు కారణం.. ఎవరి వల్ల తాను ఈ పొజిషన్ లో ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రియలైజ్ అవుతాడు.

ఆ తర్వాత మహేశ్ బాబు ఒక్కడు సినిమా రిలీజ్ రోజున హడావుడి ఉంటుంది. ఒక్కడు సినిమా రిలీజ్ రోజు 40 అడుగుల మహేశ్ బాబు కట్ అవుట్ ను అభి ఏర్పాటు చేయిస్తాడు.

కాలేజీలో సరదాలు, షికార్లు, కామెడీ, ఎంజాయ్.. ఇలా అభి కాలేజీకి సంబంధించిన సీన్లు వస్తాయి.
ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. అభి థాంక్యూ టూర్ ను స్టార్ట్ చేస్తాడు. తన కాలేజీ నుంచే థాంక్యూ టూర్ ను ప్రారంభిస్తాడు. ఆ థాంక్యూ టూర్ ఎలా జరిగింది.. ఆ టూర్ లో తాను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు అనేదే సినిమా.

ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అందులోనూ తన కాలేజీ ఎపిసోడ్స్ కొంచెం సాగదీసినట్టుగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా గడిచిపోతుంది. ఈ సినిమాలో అభిరామ్ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ దాగి ఉంటాయి. అభిరామ్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. అందులోనూ ఆయన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. టీనేజ్ కుర్రాడిగా, కాలేజీకి వెళ్లే యువకుడిగా, ఆ తర్వాత సక్సెస్ అయిన ఒక వ్యక్తిగా అన్ని పాత్రల్లో ఒదిగిపోయాడు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది