Father And Son Relation : 100 ఏళ్ల తండ్రి 75 ఏళ్ల కొడుకు… వీరి అనుబంధాన్ని చూస్తే స‌లామ్ కొట్టాల్సిందే.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Father And Son Relation : 100 ఏళ్ల తండ్రి 75 ఏళ్ల కొడుకు… వీరి అనుబంధాన్ని చూస్తే స‌లామ్ కొట్టాల్సిందే.. వీడియో !

 Authored By aruna | The Telugu News | Updated on :28 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Father And Son Relation : 100 ఏళ్ల తండ్రి 75 ఏళ్ల కొడుకు... వీరి అనుబంధాన్ని చూస్తే స‌లామ్ కొట్టాల్సిందే.. వీడియో !

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సోషల్ మీడియా కారణంగా ఒక రాష్ట్రం లేదా ఒక దేశంలో జరిగిన సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ సోషల్ మీడియా కారణంగా ప్రస్తుత కాలంలో పిల్లలు వారి తల్లిదండ్రుల ప్రేమను కూడా సరిగా పొందలేకపోతున్నారు. మొత్తం డిజిటల్ యుగం కావడంతో మనిషికి మనిషికి మధ్య మాటలు పలకరింపు కూడా కరువైపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొందరు వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్పిస్తుంటే మరికొందరు వారి తల్లిదండ్రులను సరిగా పలకరించకుండా ఫోన్ లోనే నిమగ్నం అవుతున్నారు. ఇక ఇలాంటి వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఒక గుణపాఠం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో 75 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి 100 సంవత్సరాలు కలిగిన తన తండ్రితో కలిసి ఉంటున్న తీరు చూస్తే ఎవరైనా ముక్కు పై వేలు వేసుకోవాల్సిందే.

అంతలా ఏముంది ఈ వీడియోలో అంటే చిన్న చిన్న వాటికే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్న ఈ యుగంలో 100 సంవత్సరాలు కలిగిన తన తండ్రి బెడ్ పై పడుకుని ఉండగా 75 సంవత్సరాలు కలిగిన ఆయన కొడుకు అతనితో ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన తండ్రితో విజిల్ ద్వారా ఒక పాట వినిపిస్తానని ఆ పాట ఏంటో నువ్వు కనిపెట్టి చెప్పాలంటూ విజిల్ రూపంలో ఒక పాట వినిపించాడు. కొడుకు వినిపించిన ఆ ఘనాన్ని గుర్తుపట్టిన తండ్రి ఆ పాట పేరును టక్కున చెప్పేసాడు. దీంతో కొడుకు ఆ పాటను పాడటం మొదలు పెట్టాడు.ఇలా 75 సంవత్సరాలు కలిగిన వ్యక్తి తన 100 సంవత్సరాల తండ్రితో గడుపుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి యుగంలో ఇలాంటివారు కూడా ఉన్నారా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

అలాంటి కొడుకును కన్న అతని జన్మ ధన్యమైంది అంటూ ఈ వీడియో చూసిన నేటిజెనులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 100 సంవత్సరాలు కడిగిన తండ్రిని ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ అతనితో సమయాన్ని గడుపుతూ తండ్రి చివరి రోజుల్లో అతనికి అండగా అతని పక్కనే ఉంటూ అతనితోనే కాలాన్ని గడుపుతున్న అతని కొడుకు నిజంగా చాలామందికి ఆదర్శంగా నిలుస్తాడని చెప్పాలి. ఇలాంటి కొడుకులు ఉంటే తల్లిదండ్రులు చింతించాల్సిన అవసరమే లేదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ఎవరు ఎక్కడ పోస్ట్ చేశారో అనే విషయాలు తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది