Abhishek Sharma : టీ20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ దూకుడు..టాప్ 5 లో ఎవరెవరు ఉన్నారంటే,..!
ప్రధానాంశాలు:
Abhishek Sharma : టీ20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ దూకుడు..టాప్ 5 లో ఎవరెవరు ఉన్నారంటే,..!
Abhishek Sharma : అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC (ఐసీసీ) టి-20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా, ఇందులో టీమిండియా Team India మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. తాజాగా england ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టి-20 ల సిరీస్ ని 4-1 తో India భారత్ కైవసం చేసుకోవడంతో ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. 73 మ్యాచ్ లు ఆడిన భారత్ 268 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా 259 పాయింట్లతో ఉంది.
Abhishek Sharma అభిషేక్ రికార్డ్..
ఇక ఇంగ్లండ్‌పై ఐదో టీ20లో 37 బంతుల్లోనే శతకం నమోదు చేసిన యువ బ్యాటర్.. ఏకంగా రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అభిషేక్ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనే కాదు ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం.
బ్యాటింగ్ విభాగంలో టాప్ -5లో అభిషేక్ శర్మతో Abhishek Sharma పాటు ఇతర ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. తిలక్ వర్మ మూడో స్థానంలో ఉంటే… భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు హార్దిక్ పాండ్య ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా, శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలను మెరుగుపరచుకుని 58వ ర్యాంక్ దక్కించుకున్నాడు.ఇంగ్లండ్‌పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో ర్యాంక్ దక్కించుకున్నాడు.