India Vs pakistan : ఆసియా కప్ 2025.. భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India Vs pakistan : ఆసియా కప్ 2025.. భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •   India Vs pakistan : ఆసియా కప్ 2025.. భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!

India Vs pakistan : asia cup 2025 క్రికెట్ Cicket అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ యుద్ధం త్వరలోనే జరగనుంది. ఆసియా కప్ 2025 సందర్భంగా ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో పోటీపడనున్నాయని క్రికెట్ వర్గాల సమాచారం. దీంతో రెండు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి.

India Vs pakistan ఆసియా కప్ 2025 భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం

India Vs pakistan : ఆసియా కప్ 2025.. భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!

India Vs pakistan : రెడీగా ఉండండి..

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ మొదటి మ్యాచ్: సెప్టెంబర్ 7న జ‌రగ‌నుండ‌గా, రెండవ మ్యాచ్: సెప్టెంబర్ 14న జ‌ర‌గ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌లూ దుబాయ్ లేదా అబుదాబి వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తుది షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) త్వరలోనే ప్రకటించనుంది. ఈసారి ఆసియా కప్ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి వాటిలో భారత్,పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్, హాంకాంగ్ ఉన్నాయి.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పోరుబరిలో భారత-పాక్ మ్యాచ్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగలా మారనుంది. స్టేడియాల్లోనే కాకుండా టీవీలకు, మొబైల్ ఫోన్ల ముందు కోట్లాది మంది క్రీడాభిమానులు కూర్చొని వీక్షిస్తున్నారు.. మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ వివరాలను టోర్నమెంట్ సమీపించే కొద్దీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటివరకు సమాచారం ప్రకారం, ఈ మ్యాచ్‌లు కూడా అద్భుత రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది