BCCI : టీమిండియా ఆడాలంటే ఆ టెస్ట్ పాస్ అవ్వాల్సిందేనా.. ఈ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం
BCCI : 2023 వచ్చేసింది. ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఈ సంవత్సరమే జరగనుంది. అది కూడా మన దేశంలో జరగనుంది. కాబట్టి ఇప్పటి నుంచే టీమిండియా ఈ వరల్డ్ కప్ ను గెలుచుకోవడానికి సాధన చేస్తోంది. 2023 వరల్డ్ కప్ గెలుచుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిపై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, చేతన్ శర్మ, జైషాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫెయిల్ అవడంపై ఈ మీటింగ్ లో చర్చించారు. అలాగే.. బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. అయితే.. బీసీసీఐ ప్లేయర్స్ గాయాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే.. ఇటీవల పలు మ్యాచ్ లలో కీ ప్లేయర్స్ గాయాలతో జట్టుకు దూరం అవుతున్నారు. దీని వల్ల గెలవాల్చిన గేమ్ ను కూడా టీమిండియా గెలవలేకపోతోంది. 2022 లో టీమిండియాలో కీలకంగా ఉన్న బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ జడేజా గాయాలతో జట్టుకు దూరం అయ్యారు.
BCCI : 2022 లో జస్ప్రీత్ బుమ్రా, జడేజా గాయాలతో జట్టుకు దూరం
అది వరల్డ్ కప్ లో తీవ్రంగా ప్రభావం చూపించింది. అయితే.. వాళ్లు గాయాలతో జట్టుకు దూరం అవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ కావడం వల్ల వచ్చే ఐపీఎల్ లో కీలక ఆటగాళ్లకు కొన్ని మ్యాచ్ లలో రెస్ట్ ఇచ్చేలా బీసీసీఐ ప్రణాళికలు చేస్తోంది. కీలక ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్, బుమ్రా, హార్థిక్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లు ఈ సంవత్సరంలో 2023 ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు ఆడకుండా కేవలం కొన్ని మ్యాచ్ లకే వాళ్లను పరిమితం చేసేలా బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.