Dinesh Karthik : ఇక బ్లూ జెర్సీ వేసుకోను.. దినేష్ కార్తీక్ ఎమోషనల్ వీడియో…..!
Dinesh Karthik: ఒక రంగంలో రాణించాలంటే అది మాములు విషయం కాదు. ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే దినేష్ కార్తీక్ పడిలేచిన కెరటం అని చెప్పుకోవచ్చు. 37 సంవత్సరాల వయస్సులో దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో రాణించి టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ జట్టులోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ వరల్డ్ కప్ కార్తీక్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడకపోవడంతో అతడిని న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టూర్ కు ఎంపిక చేయలేదు. మిగిలిన మ్యాచ్ ల్లో కార్తీక్ ఆడడంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ తను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు సంకేతాలు పంపాడు.
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తాను ఎలా గడిపిందీ, తన ఫ్యామిలీ, టీమ్‌మేట్స్‌తో ఎలా క్వాలిటీ మూమెంట్స్ ఎంజాయ్ చేసాడన్నది వీడియోలో చూపించాడు. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాలన్నది తన డ్రీమ్ అని.. కొంతకాలంగా ఈ వికెట్ కీపర్ చెబుతూ రాగా, ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించాడు. కాకపోతే భారత్‌కి కప్ అందించలేకపోయాడు. అయితే తనతోపాటూ జర్నీ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ… తనను నేషనల్ టీమ్‌లోకి తెచ్చిన వారికి కూడా థాంక్స్ చెప్పాడు దినేష్ కార్తీక్. ఈ ఎమోషనల్ వీడియోని గమనిస్తే..!
Dinesh Karthik : ఆ న్యూస్ చెప్పబోతున్నాడా..!
అతను తిరిగి బ్లూ జెర్సీ వేసుకునే అవకాశాలు సన్నగిల్లినట్టే కనిపిస్తున్నాయి.. వీడియోకి ఇచ్చిన క్యాప్షన్‌లో… “టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా తరపున ఆడేందుకు చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎంతో గర్వంగా ఉంది.. ఇది నా జీవితంలో ఎన్నో మధురస్మతులని మిగిల్చింది. నా తోటి ప్లేయర్లు, కోచ్‌లు, స్నేహితులు, ముఖ్యంగా అశేష అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. నా కల నిజమైంది” అని రాసుకొచ్చాడు. దీంతో దినేష్ కార్తీక్ ఇక మరి కొద్ది రోజులలో రిటైర్‌మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కార్తీక్ ని న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌లకి ఎంపిక చేయకపోవడానికి కారణం అతను తన పనిభారాన్ని తగ్గించడానికే అని ఇటీవల చేతన్ శర్మ చెప్పాడు.
View this post on Instagram