Dinesh Karthik : రిటైర్ అయ్యాడో లేదో టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ కొట్టేసిన‌ దినేష్ కార్తీక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dinesh Karthik : రిటైర్ అయ్యాడో లేదో టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ కొట్టేసిన‌ దినేష్ కార్తీక్

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2024,11:30 am

Dinesh Karthik : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఓ వైపు లీగ్‌కు వీడ్కోలు పలికిన బాధ, మరోవైపు టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించిన నిరాశతో కార్తీక్ కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని వీడాడు. రిటైర్మెంట్‌పై అధికారికంగా ఎలా నోట్‌ను రిలీజ్ చేయలేదు. కానీ పరోక్షంగా మాత్రం తెలియ‌జేశాడు. అయితే దినేశ్ కార్తీక్‌కు ఆర్సీబీ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ పెవిలియన్‌కు చేరడం అంద‌రిని ఆక‌ట్టుకుంది.

Dinesh Karthik : బంప‌ర్ ఆఫర్..

ఇక ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడో లేదో దినేష్ కార్తీక్ మంచి ఆఫ‌ర్ ప‌ట్టేశాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం స్టార్‌లు, లెజెండరీ ప్లేయర్‌లతో నిండిన వ్యాఖ్యాతల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. రవిశాస్త్రి, ఇయాన్ బిషప్, హర్షా భోగ్లే, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు ఉన్న ఈ ప్రధాన టోర్నమెంట్ కోసం ఐసీసీ 40 మంది వ్యాఖ్యాతలను ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌లో దినేష్ కార్తీక్‌ను కూడా ఐసీసీ చేర్చింది. గత కొన్నేళ్లుగా, అతను వ్యాఖ్యానంలో తనకంటూ మంచి పేరు సంపాదించాడు. దీంతో దినేష్ కార్తీక్ కూడా టీ20 ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టాడు. అతనితో పాటు, రవిశాస్త్రి, హర్షా భోగ్లే, మెల్ జోన్స్, ఇయాన్ బిషప్, నాజర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్‌లతో సహా వ్యాఖ్యాన ప్రముఖుల పేర్లు కూడా చేర్చారు.

Dinesh Karthik

Dinesh Karthik

50 ఓవర్ల ప్రపంచ కప్ విజేతలు రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, వసీం అక్రమ్ కూడా రాబోయే టోర్నమెంట్‌పై విశ్లేషణను అందించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఈ 40 మంది దిగ్గజాలు తమ విశ్లేషణ, లైవ్ కామెంటరీతో ప్రేక్షకులను అలరిస్తూ, ఉర్రూతలూగించనున్నారు. ఇక దినేష్ విష‌యానికి వ‌స్తే.. ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడిన డీకే 26.32 సగటు, 135 స్ట్రైక్‌రేటుతో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తీక్ సత్తాచాటాడు. 162 స్ట్రైక్‌రేటుతో 937 పరుగులు చేశాడు. 82 ఫోర్లు, 53 సిక్సర్లు సాధించాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది