ICC Cricket World Cup 2023 : జట్టు ఫేట్‌నే మార్చేసిన క్యాచ్ మిస్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్యాచ్‌లను డ్రాప్ చేసి కప్ మిస్ చేసుకున్న జట్లు ఇవే
ప్రధానాంశాలు:
ఐసీసీ వరల్డ్ కప్ లో దుమ్ములేపుతున్న భారత్
ఇండియా ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుందా?
ఒక్క క్యాచ్ మిస్ అయితే.. జట్టు ఫేటే మారిపోతుందా?
ICC Cricket World Cup 2023 : ప్రస్తుతం ప్రపంచమంతా ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫీవర్ నడుస్తోంది. అందులోనూ భారత్ లో వరల్డ్ కప్ జరుగుతోంది. సొంత గడ్డపై భారత్ కూడా దూసుకుపోతోంది. సెమీస్ బెర్త్ కూడా కన్ఫమ్ చేసుకుంది. అయినా కూడా సెమీస్ దాటి ఫైనల్స్ కు వెళ్తేనే కప్ కొట్టే చాన్స్ వచ్చేది. ఫైనల్స్ లో అదరగొడితేనే కప్ కొట్టేది. అందుకే.. భారత్ ఈ సారి ఎలాగైనా కప్ కొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సొంత గడ్డపై వరల్డ్ కప్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచినా.. సెమీస్ లో కూడా రాణించాలి. అయితే.. సెమీస్, ఫైనల్స్ లో ప్రతి జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా అంతే ఇక. ఎందుకంటే.. ఒక్క పరుగు కూడా జట్టు తలరాత మార్చుతుంది. ఒక్క క్యాచ్ కూడా ప్రపంచ రికార్డును తిరగరాస్తుంది. ఇదివరకు అలా ప్రపంచ కప్ చరిత్రను మార్చిన మ్యాచ్ లు చాలా ఉన్నాయి. ఎందుకంటే.. ఇటీవల ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ తెలుసు కదా. ఎలా రెచ్చిపోయాడో.. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేశాడు. అది ఒక రికార్డు. కానీ.. మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ చేయడం వెనుక పెద్ద కథే ఉంది. మ్యాక్స్ వెల్ ముందు క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ ను ముజీబ్ వదిలేశాడు. దీంతో మ్యాక్స్ వెల్ ఆ తర్వాత రెచ్చిపోయి మరీ డబుల్ సెంచరీ చేశాడు.
అంటే.. ఒక్క క్యాచ్ పట్టకపోయినా మ్యాచ్ ల రికార్డులే మారిపోతాయా? అనేది ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో తెలిసిపోయింది. అంటే.. ఇక నుంచి జరగబోయే మ్యాచ్ లలో అన్నీ ముఖ్యమే. చాలా ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి. సెమీస్ లో ఇంకాస్త జాగ్రత్తగా అన్ని టీమ్స్ ఆడాలి. ఏదో ఒక్క క్యాచ్ కదా. మిస్ అయితే ఏంటి.. ఒక్క పరుగే కదా.. అని వదిలేస్తే.. మొదటికే మోసం వస్తుంది. ఇక.. భారత్ కూడా మంచి ఫామ్ లో ఉంది. ఒక్క బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ లోనూ ఇప్పుడు బాగానే ఉంది. కానీ.. ఒక్కోసారి విలువైన క్యాచ్ లను వదిలేసి భారత్ ఒక్కోసారి ఓటమి అంచుల్లోకి కూడా వెళ్లింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో ముఖ్యమైన క్యాచ్ లను భారత్ 6 వరకు వదిలిపెట్టింది.
ICC Cricket World Cup 2023 : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్యాచ్ లు ఇవే
అయితే.. ఒక్క క్యాచ్ తో మ్యాచ్ ఫలితం అటూ ఇటు అయిన సందర్భాలు మాత్రం బోలెడు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక్క క్యాచ్ వదిలేయడం వల్ల గెలవాల్సిన దక్షిణాఫ్రికా ఓడిపోయి.. ఓడిపోవాల్సిన ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచింది. 1999లో ఈ మ్యాచ్ జరిగింది. అలాగే.. 1992 లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ లోనూ ఇదే జరిగింది. పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో వదిలేసిన ఒక్క క్యాచ్ వల్ల.. గెలవాల్సిన ఇంగ్లండ్ ఓడిపోయింది. ఓడిపోవాల్సిన పాకిస్థాన్ గెలవడమే కాదు.. 1992 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అలాగే.. న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య 2015 లో జరిగిన మ్యాచ్ లోనూ శామ్యూల్స్ క్యాచ్ ను వదిలేయడంతో.. న్యూజిలాండ్ గెలిచింది…