ENG vs NZ : ఇంగ్లండ్ అందుకే ఓడిపోయిందా? ఈసారి ఇంగ్లండ్ ఖేల్ ఖతమేనా? టీమ్ పై ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి?
ENG vs NZ : అంతర్జాతీయ క్రికెట్ సమరం ఆరంభమైంది. అది కూడా భారత్ లో. ఇండియాలో క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ కు కోట్లాది మంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. అందులోనూ భారత్.. ఈసారి ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తోందంటే మామూలుగా ఉండదు కదా. ఇక ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. 2019 లో జరిగిన ప్రపంచకప్ ను ఇంగ్లండ్ సాధించిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి డిఫెండింగ్ చాంపియన్ గా ఇంగ్లండ్ బరిలోకి దిగినా.. తొలి మ్యాచ్ లోనే బోల్తా పడింది ఇంగ్లండ్. తొలి మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
అయితే.. బౌలింగ్ ఎంచుకోవడమే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ చేసిన బెస్ట్ పని. ఎందుకంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 282 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 300 స్కోరు కూడా చేయలేకపోయింది. 9 వికెట్లు నష్టపోయింది. అయినా కూడా న్యూజిలాండ్ ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని.. ఈ స్కోర్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంగ్లండ్ గెలుపు ఖాయమే అనుకున్నారు. కానీ.. ఇంగ్లండ్ అదరగొట్టేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరూ కలిసి దుమ్ముదులిపేశారు. ఇద్దరూ కలిసే న్యూజిలాండ్ ను గెలిపించారు. కాన్వే 151 పరుగులు చేయగా.. రవీంద్ర 123 పరుగులు చేశాడు. అసలు ఇంగ్లండ్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేశారు.
ENG vs NZ : 36 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించిన న్యూజిలాండ్
ఇంగ్లండ్ ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంటి.. అందులోనూ డిఫెండింగ్ చాంపియన్ అంటూ ఫ్యాన్స్ తెగ నవ్వుకున్నారు. తొలి మ్యాచ్ లోనే ఇంత దారుణంగా ఓడిపోతే నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోతుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈసారి టైటిల్ కోల్పోవాల్సిందే. ఇంగ్లండ్ డిఫెండ్ చేసుకోదు అంటే ఇదేనా.. తమ స్కోర్ ను కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు కదా అని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇంగ్లండ్ జట్టును ట్రోల్ చేస్తున్నారు. జట్టుపై జోక్సు పేల్చుతున్నారు. చూద్దాం మరి.. వచ్చే మ్యాచ్ లలో అయినా ఇంగ్లండ్ తన ప్రతాపాన్ని చూపిస్తుందో?