Hardik Pandya : హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ‌.. సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hardik Pandya : హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ‌.. సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Hardik Pandya : హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ‌.. సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా..!

Hardik Pandya  : హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఈ సీజ‌న్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది. సీజ‌న్ నుండి ఎలిమినేట్ అయిన తొలి జ‌ట్టుగా చెత్త రికార్డ్ మూట‌గ‌ట్టుకుంది. క‌నీసం ప్లేఆఫ్ కి చేరుకోక‌పోయిన ప‌రువైన కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అంటే అది లేదు. గత రాత్రి ముంబైపై కోల్‍కతా విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో మళ్లీ అదరగొట్టింది. దీంతో ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేసింది కేకేఆర్. ముంబై జట్టుకు మరో పరాభవం ఎదురైంది. హోం టీమ్ కోల్‍కతా 18 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. వర్షం కారణంగా ప్రారంభం ఆలస్యమవటంతో 16 ఓవర్లకు కుదించిన ఈ పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన కేకేఆర్ సూపర్ విక్టరీ కొట్టింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను మరింత పటిష్టం చేసుకుంది.

Hardik Pandya  కొంప‌ముంచిన హార్ధిక్..

ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయిన ముంబై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా హార్ధిక్ పాండ్యా చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రెండు ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. 12వ ఓవర్లో హార్దిక్‍ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. టిమ్ డేవిడ్ (0) రసెల్ బౌలింగ్‍లో డకౌట్ అయ్యాడు. యంగ్ స్టార్ తిలక్ వర్మ (17 బంతుల్లో 32 పరుగులు) కాసేపు పోరాడిన మరో ఎండ్ నుంచి సహకారం దక్కలేదు. చివరి ఓవర్లో తిలక్ కూడా ఔటయ్యాడు.నమన్ ధీర్ (6 బంతుల్లో 17 పరుగులు) కాసేపు మెరిపించినా ఫలితం లేకపోయింది. రోహిత్ శ‌ర్మ కూడా ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు.

Hardik Pandya హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ‌ సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా

Hardik Pandya : హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ‌.. సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా..!

అయితే ముంబై మ‌రో ఓట‌మ త‌మ ఖాతాలో వేసుకోవ‌డంతో విప‌రీత‌మైన రూమ‌ర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం వంటి కారణాలు సైతం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయనే వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత.. ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో పరిస్థితి మారిపోయిందనే కథనాలు వస్తున్నాయి. ఆ క్ర‌మంలో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న బాలేద‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది