Dhoni : ధోనిని డకౌట్ చేసిన అందుకే సెలబ్రేషన్స్ చేసుకోలేదు అన్న పంజాబ్ బౌలర్
Dhoni : : ఆదివారం జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. పంజాబ్‌పై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల వేదికగా జరిగినమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు రాహల్ చహర్, హర్షల్ పటేల్ విజృంభించడంతో సీఎస్కే పెద్ద స్కొరు చేయలేకపోయంది. అయితే సీఎస్కే 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అజింక్య రహానే(9) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. తర్వాత డారిల్ మిచెల్‌తో కలిసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. రుతురాజ్ 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేసి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
Dhoni : : అందుకే నో సెలబ్రేషన్స్
ఇక తర్వాత వచ్చిన శివమ్ దూబే గోల్డెన్ డకౌటయ్యాడు. మిచెల్ 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేసి 4వ వికెట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా పోరాడి 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మహేంద్ర సింగ్ ధోని కూడా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. ధోనీని క్లీన్ బౌల్డ్ చేసినా.. హర్షల్ పటేల్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. కేవలం రెండు చేతులు పైకి లేపి ఔట్ అన్నట్టు నిలుచున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం హర్షల్ పటేల్‌ను దీని గురించి ప్రశ్నించగా ధోనీపై ఉన్న గౌరవంతోనే సంబరాలు చేసుకోలేదని తెలిపాడు.
‘నాకు ధోనీ అంటే అమితమైన గౌరవం ఉంది. అందుకే అతడి వికెట్ తీసినా సెలెబ్రేట్ చేసుకోలేదు.’అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. పిచ్ విషయంలో తాను పొరబడినట్లు కూడా హర్షల్ పటేల్ చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే చెన్నై ఇచ్చిన 168 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ ఛేదించలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభసిమ్రాన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మినహా మిగతా బ్యాటర్లు ఎవరు కూడా పెద్దగా పరుగులు చేయకపోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. . చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్జీత్ సింగ్, తుషార్ రెండేసి వికెట్లు తీయగా, శాంట్నర్, శార్దూర్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కాయి.