Ind vs Pak : గ‌త రికార్డుల‌న్నీ బ్రేక్ చేసి ర‌చ్చ చేసిన ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ind vs Pak : గ‌త రికార్డుల‌న్నీ బ్రేక్ చేసి ర‌చ్చ చేసిన ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్

 Authored By sandeep | The Telugu News | Updated on :23 October 2022,9:00 pm

Ind vs Pak : టీ20 వర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ త‌న తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడ‌గా, ఈ మ్యాచ్ క్రియేట్ చేసిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆఖరి బంతికి భారత్‌ విజయం సాధించడంతో మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు తన పేరిట అనేక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో చివరి మూడు ఓవర్లలో విజయం కోసం నమోదైన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం.

చివరి బంతికి భారత్‌ విజయం సాధించగా, చివరి బంతికి టీ20లో విజయం సాధించడం ఇది నాలుగోసారి. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీని తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లో చేర్చారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా పాకిస్థాన్‌పై భారత్‌కు అతిపెద్ద భాగస్వామ్యంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించడం.. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకోవడం రికార్డు వ్యూస్‌ను తెచ్చిపెట్టింది.

Ind and Pak creates new records

Ind and Pak creates new records

Ind vs Pak : లాభాల పంట‌..

ఈ మ్యాచ్‌తో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఆసియాకప్ వేదికగా భారత్ -పాక్ తొలి మ్యాచ్‌ కోటీ 30 లక్షల వ్యూస్‌తో ఐపీఎల్ 2022 సీజన్, గత టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా మ్యాచ్ కోటీ 80 లక్షల వ్యూస్ రాబట్టింది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే అని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది