Ind Vs Aus : గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా..!
ప్రధానాంశాలు:
Ind Vs Aus : గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఎలా..!
Ind Vs Aus టీమిండియా దారుణ ప్రదర్శన కనబరుస్తుంది. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో ఓడిన ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియా లో దారుణంగా ఆడుతుంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. మెల్ బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. 340 పరుగుల భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు కుప్పకూలింది. . ఈ మ్యాచ్ తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కీలక మార్పు కనిపించింది. దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌లో తన స్థానాన్ని ధృవీకరించింది. రెండో స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. అయితే మెల్‌బోర్న్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది.
Ind Vs Aus చెత్త పర్‌ఫార్మెన్స్..
ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా పోరాడినా.. టాపార్డర్ బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచింది. రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడకుండా డ్రా కోసం ప్రయత్నించి ఉంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తప్పించుకునేది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి టీమిండియా దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా భారత్ ఫైనల్ చేరలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడం టీమిండియా విజయవశాలను దెబ్బతీసింది
నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ సెంచరీతో భారత్ ఈ మ్యాచ్‌లో పట్టు సాధించింది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(208 బంతుల్లో 8 ఫోర్లతో 84) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28), స్కాట్ బోలాండ్(3/39) మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు. ఓ దశలో రిషభ్ పంత్(30), యశస్వి జైస్వాల్ నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగేలా చేశారు. కాని పార్ట్ టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్.. టెంప్టింగ్ బాల్‌తో రిషభ్ పంత్‌ను బుట్టలో వేసుకున్నాడు. నిర్లక్ష్యపు షాట్ రిషభ్ పంత్ వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. సిడ్నీ టెస్టులో గెలిచిన తర్వాత కూడా టీమ్‌ఇండియాకు ఫైనల్ టిక్కెట్ దక్కదు. సిడ్నీ టెస్టులో గెలిచి భారత జట్టు ఫైనల్స్‌కు వెళుతుందా లేదా అనేది ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరగనున్న 2 టెస్టుల సిరీస్‌ని బట్టి నిర్ణయం అవుతుంది.