Ravindra jadeja : పుష్ప రాజ్ గెటప్ లో రవీంద్ర జడేజా.. తగ్గేదేల్యా అంటున్న భారత ఆల్ రౌండర్..!
Ravindra jadeja : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ గా భారీ ఫాన్స్ ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక తో పాటు కేరళలో ఆయనకున్న క్రేజే వేరు. మాలీవుడ్ లో అల్లు అర్జున్ ను ఏకంగా మల్లు అర్జున్ అంటూ తమ హీరోనే అనే అంతలా అక్కడి వారు మన బన్నీ ని ఓన్ చేసుకున్నారు. ఇక యుట్యూబ్ లో హిందీలోకి డబ్ అయిన బన్నీ సినిమాలకు మిలియన్ వ్యూస్ వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇక రీల్స్ లో బన్నీ పాటలకు ఉండే క్రేజ్ ఆయనను ఇండియా వైడ్ గా స్టార్ గా నిలిపింది. బుట్టబొమ్మ … బుట్టబొమ్మ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
వీలు చిక్కినప్పుడల్లా వార్నర్ తన భార్యాపిల్లలతో అల్లు అర్జున్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం , బన్నీ ఫ్యాన్స్ వార్నర్ ని పొగడ్తలతో ముంచేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా భారత స్టార్ ఆల్‌రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్ గెటప్ లో కనిపించి అభిమానులను అబ్బుర పరిచాడు.కొద్ది రోజులుగా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా.. గ్యాప్ అనంతరం మాసిన గెడ్డంతో పుష్పరాజ్ లుక్‌లో ప్రత్యక్షమైపోయాడు. మాస్ గెటప్ లో తగ్గేదేల్యా అంటూ వైరల్ అవుతున్నాడు. ఇది గమనించిన పుష్ప చిత్ర బృందం..

india criketer ravindra jadeja in pushpa raj getup went
Ravindra jadeja : పుష్ప రాజ్ గెటప్ లో జడేజా..!
రవీంద్ర జడేజా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనికి అటు క్రికెట్ అభిమానుల నుంచి మరో వైపు సినీ అభిమానుల నుంచి వేల కామెంట్స్ వస్తున్నాయి. పూర్తిగా మాస్ లుక్‌లోకి మారి బన్నీ డైలాగ్ తో అదరగొడుతున్న జడేజాను చూసి స్టైలిష్ స్టార్ అభిమానులు సంబర పడిపోతున్నారు.ప్రస్తుతం పుష్ప మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ పుష్ప మూవీ రెండో భాగంపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తుండగా.. మొదటి భాగం లోని పాటలు బన్నీ డైలాగులతో ఇన్ స్టా గ్రామ్ షేక్ అవుతోంది.
Pushpa…
Pushpa Raj…
Ni yavva Thaggedhe Le…????????#ThaggedheLe #Pushpa @imjadeja ????????#PushpaTheRise pic.twitter.com/skt0RmitkM— Pushpa (@PushpaMovie) December 23, 2021