IPL 2022 : అన్నీ మర్చిపోదాం.. హగ్ లతో ఒక్కటవుదాం.. కలిసిపోయిన దీపక్, కృనాల్
IPL 2022: క్రీడలకు ఎంతో పవర్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా మార్చివేస్తుంది. బద్ద శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుంది. ఇలాంటి ఘటనే తాజాగా ఐపీఎల్ 2022లో చోటుచేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో విభేదాల కారణంగా బద్ద శతృవులుగా మారిన భారత ఆటగాళ్లు కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలు ఐపీఎల్ పుణ్యమాని కలిసిపోయారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఈ ఇద్దరు సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో హగ్ చేసుకున్నారు.2020లో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య అభిప్రాయ విబేధాలు వచ్చాయి.
బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ కావాలనే తనపై ఆరోపణలు చేశాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తనను తిట్టాడని అప్పట్లో వైస్ కెప్టెన్ దీపక్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆపై తాను బరోడా జట్టును వీడుతున్నట్లు ప్రకటించి పెద్ద వివాదానికి తెరదీశాడు.ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక అప్పటి నుంచి ఈ వైరం ర వచ్చింది. తాజాగా ఐపీఎల్ లో జరిగిన ఓ మ్యాచ్ తో ఒక్కటైనట్లు తెలుస్తోంది.
IPL 2022: అప్పట్లో బద్ద శత్రువులు..
దీంతో ఇద్దరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) టీమ్.. ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లను కొనుగోలు చేసింది. ముందుగా దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిలార్డర్ కీలకం కానున్న ఈ ఇద్దరూ కలిసి ఆడాల్సి వస్తే.. వీరి విబేధాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇద్దరు కలిసిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.