IPL 2022 : శుభమన్ గిల్ సూప‌ర్.. క్యాచ్ కి ఫిదా అవుతున్న క్రికెట్ ల‌వ‌ర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL 2022 : శుభమన్ గిల్ సూప‌ర్.. క్యాచ్ కి ఫిదా అవుతున్న క్రికెట్ ల‌వ‌ర్స్

 Authored By mallesh | The Telugu News | Updated on :29 March 2022,1:30 pm

IPL 2022 : ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన‌ ఐపీఎల్ 2022 లీగ్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌లో కొత్త జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ హోరా హోరీగా తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 158 పరగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్ కేవలం 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. హుడా (55), ఆయుష్ బదానీ (54) అద్భుత ఇన్నింగ్స్‌తో మంచి స్కోర్ చేశారు. దీంతో గుజరాత్ టైటాన్స్ టీం ముందు 159 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

అయితే 159 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మొద‌ట్లో తడబాటుకు గురై 2 వికెట్లు కోల్పోయింది. కాగా మాథ్యూ వాడే(30), హార్దిక్ పాండ్య(33) ఇద్దరూ కలిసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఆ తరువాత వచ్చిన డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో మిల్లర్ అవుట్ అయినా.. రాహుల్ అభినవ్ మనోహర్‌(15)తో కలిసి జట్టును రెండు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు.

IPL 2022 shubhaman gill super cricket lovers fishing for catch

IPL 2022 shubhaman gill super cricket lovers fishing for catch

IPL 2022: అద్భుత‌మైన క్యాచ్

కాగా నాలుగో ఓవర్లో ఎవిన్ లూయిస్ స్క్వేర్ లెగ్ కొట్టాడు. స్కైస్‌లోకి విసిరిన బంతిని పట్టుకోవడానికి గిల్ తిరిగి పరుగెత్తాడు. అద్భుతమైన డైవింగ్ చేసి బంతిని క్యాచ్ అందుకున్నాడు. దీంతో అందరూ స్టన్ అయిపోయారు. కామెంటేటర్స్ గిల్ డైవ్ పై చాలా చ‌ర్చించారు. అద్భుతమైన డైవ్ అంటూ ప్ర‌శంస‌లు గుప్పించారు. దీంతో గిల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతని డైవ్, సూపర్ మెన్‌లా రన్నింగ్ చేసి బంతిని క్యాచ్ పట్టడంపై క్రికెట్ ల‌వ‌ర్స్ సూప‌ర్ అంటూ ఎగిరి గంతేస్తున్నారు. కాగా టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆరంభంలోనే 3 వికెట్లు పడగొట్టి అడ్డుక‌ట్ట‌వేశాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది