IPL 2025 : తొలి మ్యాచ్‌కే దెబ్బ‌.. నిరాశ‌లో ఆర్సీబీ ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL 2025 : తొలి మ్యాచ్‌కే దెబ్బ‌.. నిరాశ‌లో ఆర్సీబీ ఫ్యాన్స్

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  IPL 2025 : తొలి మ్యాచ్‌కే దెబ్బ‌.. నిరాశ‌లో ఆర్సీబీ ఫ్యాన్స్

IPL 2025 : ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

IPL 2025 తొలి మ్యాచ్‌కే దెబ్బ‌ నిరాశ‌లో ఆర్సీబీ ఫ్యాన్స్

IPL 2025 : తొలి మ్యాచ్‌కే దెబ్బ‌.. నిరాశ‌లో ఆర్సీబీ ఫ్యాన్స్

IPL 2025 నిరాశ‌లో ఫ్యాన్స్..

అయితే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేలా క‌నిపిస్తుంది. కోల్ క‌తా న‌గ‌రం ఆరెంజ్ అల‌ర్ట్ లో ఉంది. శ‌నివారం రోజు 80 శాతం వర్షం ప‌డే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తుంది. శ‌నివారం ఉద‌యం నుండి పిచ్ నిక‌వ‌ర్స్‌తో కప్పి ఉంచుతారు. 7.30ని.ల‌కి ముందు వ‌ర్షం ప‌డే ఛాన్స్ ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు, కాని దానికి వ‌ర్షం అడ్డుత‌గిలే ఛాన్స్ ఉంది.

రజత్ పాటిదార్ సారథ్యంలోని రెడ్ ఆర్మీ కోల్‌కతాలో అడుగుపెట్టింది. ఐపీఎల్ 18వ ఎడిషన్ కావడంతో అందరి కళ్లు ఈ సారి బెంగళూరు జట్టు మీదే ఉన్నాయి. విరాట్ కోహ్లి జెర్సీ నెంబర్ 18 కావడంతో ఫ్యాన్స్ ఈ సాలా కప్ నమ్దే అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అట్టహాసంగా జరిగిన ఆర్సీబీ అన్‌ బాక్స్ ఈవెంట్‌లోనూ ఫ్యాన్స్ ఇవే నినాదాలతో హోరెత్తించారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది