MS Dhoni : 40 ఏళ్ల వయస్సులోను తగ్గని ఎంఎస్ ధోని సత్తా.. మెరుపు వేగంతో రనౌట్
MS Dhoni : 40 ఏళ్ల వయస్సులోను తనలోని సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భానుక రాజపక్సని ధోనీ రనౌట్ చేసిన విధానం అభిమానులను అబ్బురపరిచింది. మెరుపు వేగంతో వికెట్ల మీదకు దూకి ధోనీ రనౌట్ చేయడం.. అభిమానులకు స్టన్నింగ్‌గా అనిపించింది. వికెట్లకు 12 మీటర్ల దూరంలో ఉన్న ఎంఎస్.. పిచ్‌పై 9 మీటర్ల దూరంలో ఉన్న బ్యాటర్‌ని రనౌట్ చేసి ధోనీ ఈజ్ […]
MS Dhoni : 40 ఏళ్ల వయస్సులోను తనలోని సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భానుక రాజపక్సని ధోనీ రనౌట్ చేసిన విధానం అభిమానులను అబ్బురపరిచింది. మెరుపు వేగంతో వికెట్ల మీదకు దూకి ధోనీ రనౌట్ చేయడం.. అభిమానులకు స్టన్నింగ్‌గా అనిపించింది. వికెట్లకు 12 మీటర్ల దూరంలో ఉన్న ఎంఎస్.. పిచ్‌పై 9 మీటర్ల దూరంలో ఉన్న బ్యాటర్‌ని రనౌట్ చేసి ధోనీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అంతేకాదు ధోని ఫిట్‌నెస్ పైన, యాక్టివ్‌నెస్‌పైన ప్రశంసల జల్లు కురుస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని భానుక రాజపక్స సిక్సర్‌గా తరలించాడు.. ఆ తరువాత బంతిని స్ట్రెయిట్‌గా ఆడేందుకు ప్రయత్నించగా అది నేరుగా బౌలర్ జోర్డాన్ చేతికి చిక్కింది. దాంతో వెంటనే బంతిని కీపర్ వైపు వేగంగా విసరగా.. వికెట్ల వెనుక 12 మీటర్ల దూరంలో ఉన్న ధోని బంతిని అందుకుని ఒక్క ఉదుటున వికెట్ల మీద పడి రాజపక్సని రనౌట్ చేశాడు. బ్యాటర్ ముందుకొచ్చే సమయంలో కేవలం 1.2 సెకన్లలో 9 మీటర్లు దూకేసి రనౌట్ చేశాడు.మెరుపు వేగంగా వచ్చి ధోనీ రనౌట్ చేయడంతో ట్విటర్‌లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
MS Dhoni : ధోని ఈజ్ బ్యాక్..
ధోనీకి వయస్సనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అంటూ తలా ధోనీ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ టోర్నీలోకి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవి చూసింది. ఆదివారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఏకంగా 54 పరుగుల తేడాతో చిత్తైంది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో రవీంద్ర జడేజా జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పలేదు.
https://twitter.com/aayusht1802/status/1510622049026248704?s=20&t=eJxqHiAah_DzDvVm1TPh5A