MS DHONI : ధోని సంచలన కామెంట్స్.. ఐపీఎల్-2021 టోర్నీ విజేతలు వాళ్లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

MS DHONI : ధోని సంచలన కామెంట్స్.. ఐపీఎల్-2021 టోర్నీ విజేతలు వాళ్లే

MS DHONI : ఐపీఎల్ -2021 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ సింగ్స్ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. అయితే, విక్టరీ సెలబ్రేషన్స్ అనంతరం సీఎస్కే జట్టు కెప్టెన్ మహేంధ్ర సింగ్ ధోని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ తామే విజేతలం అనుకుంటున్నారని కానీ, అసలు విజేతలం మేము కాదని ధోని అన్నారు. ఈ వ్యాఖ్యలు విని అందరూ కొంత షాక్ అయ్యారు. కానీ, ధోని అసలు విషయం ఎంటో చెప్పడంతో అందరూ మిస్టర్ కూల్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :16 October 2021,12:30 pm

MS DHONI : ఐపీఎల్ -2021 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ సింగ్స్ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. అయితే, విక్టరీ సెలబ్రేషన్స్ అనంతరం సీఎస్కే జట్టు కెప్టెన్ మహేంధ్ర సింగ్ ధోని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ తామే విజేతలం అనుకుంటున్నారని కానీ, అసలు విజేతలం మేము కాదని ధోని అన్నారు. ఈ వ్యాఖ్యలు విని అందరూ కొంత షాక్ అయ్యారు. కానీ, ధోని అసలు విషయం ఎంటో చెప్పడంతో అందరూ మిస్టర్ కూల్ ను పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు.అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ -2021 టోర్నీని ధోనసేన ఎగరేసుకుపోయింది.

MS dhoni sensational comments Ipl 2021

MS dhoni sensational comments Ipl 2021

శుక్రవారం kkr vs csk మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసి సీఎస్కే జట్టు విధించిన 193 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి కేకేఆర్ జట్టు ఓపెనర్లు తొలి 10 ఓవర్లలో చెన్నై జట్టుకు భయం అంటే ఎంటో చూపించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) చెరో అర్థ సెంచరీలతో ధోని సేనకు చుక్కలు చూపించారు. అయితే, 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ మొత్తం సీఎస్కే చేతిలోకి వెళ్లిపోయింది. చైన్నై బౌలర్ల విజృంభణతో కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. వచ్చిన బ్యాట్స్‌మెన్స్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. చైన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ -3, రవీంద్ర జడేజా-2, హజీల్ వుడ్ -2 వికెట్లు తీయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఫిక్స్ అయిపోయింది.

MS DHONI : గెలుపు మాది కాదు.. నిజానికి వారిదే

19వ ఓవర్లో 162/8 పరుగుల కేకేఆర్ టేలెండ్ బ్యాట్స్ మెన్స్ జట్టును గెలిపించేందుకు చాలా శ్రమించారు. కానీ చివరి ఓవర్‌ను బ్రావో తనదైన విధంగా స్లో బంతులు వేసి కేకేఆర్ పతనాన్ని చూశాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో KKR జట్టుపై 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చాలా మంది మాజీ సీనియర్ ఆటగాళ్లు చెప్పిన విధంగానే ధోని మరోసారి చెన్నై జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇదిలాఉండగా, చెన్నై జట్టు ధోని కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకోవడం ఇది నాలుగోసారి.

MS dhoni sensational comments Ipl 2021

MS dhoni sensational comments Ipl 2021

అయితే, చాలా మంది సీఎస్కే జట్టు విజేత అనుకుంటున్నారని.. నిజానికి ఆ క్రెడిట్ కేకేఆర్ జట్టుకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు.ఐపీఎల్-2021 టోర్నీ విజేతలు కోల్‌కత్తానే అని ధోని కామెంట్ చేశారు. ఇంత తక్కువ సమయంలో కేకేఆర్ ఇంతలా పుంజుకుంటుందని అనుకోలేదన్నాడు. కరోనా సమయంలో దొరికిన విరామ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుని అందరినీ దాటుకుంటూ ఫైనల్ దాకా చేరుకుని మాకు టఫ్ ఫైట్ ఇచ్చారని పేర్కొన్నారు. ధోని మాటలు విన్న ఫ్యాన్స్.. గెలుపు గర్వం అనేది లేకుండా మంచి ఔదార్యాన్ని ప్రదర్శించాడని మెచ్చుకుంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది