MS Dhoni : ఎంఎస్ ధోని కెప్టెన్సీతో మారిన చెన్నై రాత‌.. త‌గ్గ‌ట్లేదుగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

MS Dhoni : ఎంఎస్ ధోని కెప్టెన్సీతో మారిన చెన్నై రాత‌.. త‌గ్గ‌ట్లేదుగా..!

MS Dhoni : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ అంత‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌లేద‌నే చెప్పాలి. జ‌డేజా కెప్టెన్సీలో సీఎస్‌కే వ‌రుస ప‌రాజ‌యాలు చెంద‌డంతో ధోని కెప్టెన్సీ అందుకున్నాడు. ఇక ఆయ‌న కెప్టెన్సీలో చెన్నై దూసుకుపోతుంది. ఐపీఎల్ 2022లో 55వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఆసక్తిగా సాగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :9 May 2022,11:00 am

MS Dhoni : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ అంత‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌లేద‌నే చెప్పాలి. జ‌డేజా కెప్టెన్సీలో సీఎస్‌కే వ‌రుస ప‌రాజ‌యాలు చెంద‌డంతో ధోని కెప్టెన్సీ అందుకున్నాడు. ఇక ఆయ‌న కెప్టెన్సీలో చెన్నై దూసుకుపోతుంది. ఐపీఎల్ 2022లో 55వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఆసక్తిగా సాగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నైసూపర్ కింగ్స్ ఆరంభం నుంచి ఓ ఛాంపియన్‌లా ఆడింది. రుతురాజ్ గైక్వాడ్, కాన్వేలు చెలరేగి ఆడారు.

కాన్వే కేవలం 49 బంతుల్లో 87 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ ధోని 8 బంతుల్లో 21 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. తొలుత వికెట్లు పడగట్టలేక విఫలమైన ఢిల్లీ బౌలర్లు చివర్లో మాత్రం వికెట్లు పడగొట్టారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు 2 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయింది. అయినా సరే ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఆటగాళ్లు ధాటిగానే ఆడటం ప్రారంభించారు. ధాటిగా ఆడుతూనే వికెట్లు కోల్పోయారు. ఆ తరువాత వార్నర్ వికెట్ కోల్పోయింది ఢిల్లీ కేపిటల్స్ జట్టు. 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసిందంటే..ఎంత ధాటిగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత 25 పరుగుల వద్ద మిచెల్ మార్ష్‌ను మొయిన్ అలీ అవుట్ చేశాడు.

MS Dhoni team wins in ipl

MS Dhoni team wins in ipl

MS Dhoni : ధోనినా, మ‌జాకానా..!

కాస్సేపటికి కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ధాటిగా ఆడుతూనే..మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి..82 పరుగులు చేసింది. ఇలా కొద్ది గ్యాప్‌లోనే వ‌రుస వికెట్స్ కోల్పోయింది.117 పరుగులకు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే ఆలౌట్‌ అయింది. 91 పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు ధోని. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మహీ ఒక్కడికే ఈ ఘనత సాధ్యమైంది. దాంతో మహీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీ20 క్రికెట్‌లో ధోనీని మించిన ఫినిషర్ లేడని కొనియాడుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది