Dhoni : నువ్వు ఇలా చేయడం ఏంటి ధోని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు
ప్రధానాంశాలు:
Dhoni : నువ్వు ఇలా చేయడం ఏంటి ధోని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు
Dhoni : ఎంఎస్ ధోని క్రికెట్‌లో ఓ లెజెండ్. ఆయన చాలా కూల్‌గా ఉంటూ ఇతర ఆటగాళ్లని ప్రోత్సహిస్తూ అద్భుతమైన క్రికెట్ ఆడుతుంటాడు. అయితే గత రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఆట తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా చెన్నై టీం బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో మరోసారి అదరగొట్టగా.. అజింక్యా రహానే(24 బంతుల్లో 5 ఫోర్లతో 29) పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/17), రాహుల్ చాహర్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
Dhoni : ధోని ఆట బాలేదు..
ఇక లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి మంచి విజయాన్ని సాధించింది. జానీ బెయిర్ స్టో(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46), రీలీ రోసౌ(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) విరుచుకుపడగా.. శశాంక్ సింగ్(25 నాటౌట్), సామ్ కరణ్(26 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుని గెలిపించారు. ఇక చెన్నై బౌలర్లలో శివమ్ దూబే, రిచర్డ్ గ్లీసన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.అయితే మ్యాచ్ చివరి ఓవర్‌లో డారిల్ మిచెల్-ధోని క్రీజులో ఉండి బ్యాటింగ్ చేస్తున్నారు. చివరి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి ధోనీ శుభారంభం చేశాడు. రెండో బంతికే అద్భుతమైన షాట్ కొట్టినా, బంతి బౌండరీకి వెళ్లలేదు.
కాకపోతే అక్కడ సింగిల్ వస్తుందని గ్రహించిన డారిల్ మిచెల్ సింగిల్ కోసం పరిగెత్తాడు, కానీ ధోని అతనిని వెనక్కి పంపాడు. అంటే పరుగులు వచ్చే టైమ్ లో క్రీజులో నుంచి పరుగుకు కాల్ ఇచ్చినా.. అవతలి వైపుకు ధోని వెళ్లలేదు. ఆ ఓవర్ మొత్తం ధోని బ్యాటింగ్ చేశాడు. ఒక్క సిక్సర్ తప్ప పెద్దగా హిట్ చేసింది లేదు.అయితే డారెల్ మిచెల్ కూడా మంచి ఆటగాడే . అయినప్పటికీ అతనికి స్ట్రైక్ ఇవ్వనందుకు అభిమానులు ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ.. తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి. కొందరు అయితే ధోని ప్రవర్తించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.