SRH : ఎస్ఆర్‌హెచ్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త.. డేంజరస్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
ప్రధానాంశాలు:
SRH : ఎస్ఆర్‌హెచ్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త.. డేంజరస్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
SRH : మార్చి 22 నుండి ఐపీఎల్ టోర్నీ జరగనుండగా, ఈ సారి పోరు మంచి రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. ఇదే సమయంలో సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి పెద్ద గుడ్ న్యూస్ అందింది. టీమిండియా స్టార్ట్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్‌కుమార్ రెడ్డి త్వరలోనే ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో జాయిన్ కాబోతున్నాడు.

SRH : ఎస్ఆర్‌హెచ్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త.. డేంజరస్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
SRH ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు..
రెండు నెలలుగా ఇంజ్యూరీతో బాధపడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నాడంటూ నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందుగానే జట్టుతో కలవనున్నాడు.ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు.
ఈ సిరీస్ రెండో టీ20కి ముందు అతను ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. అప్పటి నుంచి బెంగళూరులోని ఎన్‌సీఏలోనే రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు సిద్దమయ్యాడు. గాయాలపాలయిన టీమిండియా క్రికెటర్లకు కూడా వారి ఫిట్‌నెస్ ఆధారంగా బీసీసీఐ ఐపీఎల్‌కి వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది.