Rishabh Pant : యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా పంత్‌లో తగ్గని ఆవేశం.. బ్యాట్ నేలకేసి కొట్టేశాడు…
ప్రధానాంశాలు:
rishabh pant : యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా పంత్‌లో తగ్గని ఆవేశం.. బ్యాట్ నేలకేసి కొట్టేశాడు...
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ కీపర్ క్యాచ్‌గా ఔటయ్యాడు. చాహల్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడే క్రమంలో అతను ఔటయ్యాడు.
rishabh pant : రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాదిన్నరగా క్రికెట్‌కి పూర్తిగా దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఈ సీజన్ ఐపీఎల్‌తో మళ్లీ గ్రౌండ్‌లో సందడి చేస్తున్నాడు.రిషబ్ కెప్టెన్సీలో ఢిల్లీ పెద్దగా ప్రదర్శన కనబరచడం లేదు. పంత్ వ్యక్తిగత ప్రదర్శన కూడా పెద్దగా లేదు. ఈ క్రమంలో అతను తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో 18 పరుగులే చేసి ఔటైన పంత్.. అప్పుడు తీవ్ర ఆగ్రహంతో బ్యాట్‌ను నేలకు కొట్టాడు. అంతటితో ఆగకుండా డగౌట్‌లో కూర్చున్న హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మోకాలిపై తన కోపాన్ని ప్రదర్శించడం కెమెరాలలో రికార్డ్ అయింది. ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో పంత్‌ని బ్యాట్‌ని నేలకోసి కొట్టాడు.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ కీపర్ క్యాచ్‌గా ఔటయ్యాడు. చాహల్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడే క్రమంలో అతను ఔటయ్యాడు. అయితే కీలక సమయంలో తాను ఔట్ కావడంతో పంత్ తీవ్ర అసహనానికి గురై డ్రెస్సింగ్ రూమ్ వెళ్లేప్పుడు బ్యాట్‌ని కింద కొట్టాడు. ఇది చూసిన నెటిజన్స్ ఎందుకు పంత్ ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ సత్తా చాటగా.. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్ ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి తమ జట్టుకి మంచి విజయాన్ని అందించాడు.
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 నాటౌట్) , రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 3 సిక్స్‌లతో 29), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 3 ఫోర్లతో 20) మెరుపులు మెరిపించడంతో మంచి స్కోరు సాధించింది. కాని ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులే చేసి మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.. డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బర్గర్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.