Virat Kohli : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క‌లిసిపోయారుగా.. మైదానంలో వారిని చూసి ఆనందంలో ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క‌లిసిపోయారుగా.. మైదానంలో వారిని చూసి ఆనందంలో ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :7 February 2022,11:00 am

Virat Kohli: ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాళ్లు. మూడు ఫార్మెట్లలోనే టీమిండియాను టాప్ ప్లేస్‌లో నిలపడంలో ఇద్దరిదీ కీలక పాత్ర. గ‌త కొద్ది రోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక ఎప్పుడైతే కోహ్లీని త‌ప్పించి రోహిత్‌ని ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా నియ‌మించారో పుకార్లు మ‌రింత వేడెక్కాయి. రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీ ఆడ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా జ‌రిగిన వ‌న్డే సిరీస్ పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టింది.

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన‌ తొలి వన్డేలో రోహిత్ శర్మ పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. 4 ఏళ్ల పాటు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ ప్లేయ‌ర్‌గా మాత్ర‌మే గ్రౌండ్‌లో దిగాడు. తొలిసారి రోహిత్ కెప్టెన్సీలో ఆడిన విరాట్ కోహ్లీ, ఎలా ఉంటాడు, రోహిత్‌తో ఎలా ముందుకు వెళ్తాడోనని అంతా భావించారు. అయితే మైదానంలో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వీరి కెమిస్ట్రీ ఆకట్టుకోవడం విశేషం. మైదానంలో వారు చాలా సరదాగా కలిసిపోయారు. జట్టు కోసం సర్వస్వం ధారపోసిన విరాట్ స్ఫూర్తి మరోసారి కనిపించింది. కోహ్లి కూడా రోహిత్‌కు సహాయం చేస్తూ కనిపించాడు.

rohit sharma takes help form virat kohli

rohit sharma takes help form virat kohli

Virat Kohli : మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయా..

రోహిత్‌కి మ్యాచ్ స‌మ‌యంలో ప‌లు సూచ‌న‌లు చేశాడు కోహ్లీ. విండీస్‌ బ్యాటింగ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ ఆఖరి బంతికి విండీస్‌ బ్యాటర్‌ షమ్రా బ్రూక్స్‌ వికెట్‌కీపర్‌ క్యాచ్‌ ఔట్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు అపీల్‌ చేశారు. అయితే ఈ అపీల్‌ను అంతగా పట్టించుకోని ఫీల్డ్‌ అంపైర్‌ బ్రూక్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై రివ్యూకి వెళ్లేందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తొలుత వికెట్‌కీపర్‌ పంత్‌ను సంప్రదించగా, అతను బంతి బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు. ఇంతలో కోహ్లి వారి దగ్గరికి వచ్చి బంతి బ్యాట్‌కు కచ్చితంగా తాకిందని చెప్పడంతో రోహిత్‌ ఏమాత్రం ఆలోచించకుండా రివ్యూకి వెళ్లాడు. దీంతో ఫ‌లితం ఇండియా వైపుకు వ‌చ్చింది. దీంతో అంద‌రు కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది